Virender Sehwag: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలుస్తున్నాడు. సెహ్వాగ్ తన 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నాడని, తన భార్య ఆర్తి అహ్లావత్ తో విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాదు వీరిద్దరూ గత కొంతకాలంగా విడివిడిగా జీవిస్తున్నారని, త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది.
Also Read: Gujarat Titans: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్‌కు కొత్త యజమాని?
కానీ ఈ రూమర్స్ పై ఆ జంట నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే వీరేంద్ర సెహ్వాగ్ – ఆర్తి వారి ఇంస్టాగ్రామ్ లలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు, గతేడాది దీపావళి రోజున సెహ్వాగ్ ఒంటరిగా ఉన్న ఫోటోలను షేర్ చేయడం, ఒంటరిగానే సెహ్వాగ్ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడం ఈ ప్రచారానికి బలం చేకూర్చింది. సెహ్వాగ్ – ఆర్తి జంటకు 2004లో వివాహం జరిగింది. సెహ్వాగ్ కంటే ఆర్తి రెండేళ్లు చిన్నది. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో డిప్లమా చేసింది.
వీరి వివాహం దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఇంట్లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఆర్యవీర్, వేదాంత్ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా తండ్రి బాటలోనే క్రికెట్ ని కెరీర్ గా ఎంచుకున్నారు. ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఆర్యవీర్ 2020 నవంబర్ లో మేఘాలయతో జరిగిన అండర్ 19 కూచ్ బెహార్ ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించి క్రీడాభిమానుల దృష్టిలో పడ్డాడు. 229 బంతుల్లోనే 34 ఫోర్లు, రెండు సిక్సర్లతో 200 పరుగులు చేశాడు. ఇక రెండవ కొడుకు వేదాంత్.. అండర్ 16 విజయ్ మర్చంట్ ట్రోఫీలో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ స్పిన్నర్ గా రాణిస్తున్నాడు.
ఈ సీజన్ లో వేదాంత్ ఏకంగా 24 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సేహ్వాగ్ – ఆర్తి విడాకుల రూమర్స్ వైరల్ అవుతున్న నేపథ్యంలో.. వీరి గొడవకు కారణం ఇదేనంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో వీరేంద్ర సెహ్వాగ్ – అతని భార్య ఆర్తి కారులో కూర్చుని కనిపిస్తున్నారు. వీరిద్దరూ ఒకరితో ఒకరు గొడవ పడుతుండడం, సెహ్వాగ్ ఫోన్లో మాట్లాడుతూ ఆర్తి వైపు కోపంగా చూడడం కనిపిస్తోంది.
Also Read: Amitabh Bachchan: గాంధీ మార్గంలో బ్రిటీష్ వాళ్ల అంతుచూశాడు.. రోహిత్ పై బచ్చన్ కామెంట్ ?
అయితే ఈ గొడవ వల్లే సెహ్వాగ్ – ఆర్తి జంట మధ్య బంధం చెడిపోయిందని ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు. కానీ ఇది ఫేక్ వీడియో. దీనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ {ఏఐ} ద్వారా సృష్టించారు. ఈ వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విడాకుల రూమర్స్, ఈ ఫేక్ వీడియో పై సెహ్వాగ్ – ఆర్తి జంట స్పందిస్తుందా..? లేదా..? అన్నది వేచి చూడాలి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">