BigTV English

BRS New Plan: సమయం లేదు మిత్రమా.. రూటు మారింది ఎందుకు?

BRS New Plan: సమయం లేదు మిత్రమా.. రూటు మారింది ఎందుకు?

BRS New Plan: స్థానిక సంస్థల ఎన్నికలకు రేపో మాపో గంట మోగనుందా? విపక్షం బీఆర్ఎస్ వ్యూహమేంటి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో డ్రాపైన కారు పార్టీ, లోకల్‌లో సత్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోందా? సర్వశక్తులు ఒడ్డాలని ప్లాన్ చేస్తోందా? కామారెడ్డిలో బీసీ సభ పెట్టాలని ప్లాన్ చేస్తోందా? కేసీఆర్ హాజరుకాబోతున్నారా? గజ్వేల్ సభ మాటేంటి? ఇవే ప్రశ్నలు చాలామంది నేతలు వెంటాడుతున్నాయి.


తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత ఇబ్బందులు పడుతోంది బీఆర్ఎస్. అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ వేస్తున్న ఎత్తులను ఎప్పటికప్పుడు చిత్తు చేస్తున్నాయి అధికార పార్టీ కాంగ్రెస్, బీజేపీలు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవపోవడంతో ఆ పార్టీ పనైపోయిందని, కారు శాశ్వతంగా షెడ్ పోయిందని భావించారు.

ప్రస్తుతం తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. పదుల సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాకపోతే బీఆర్ఎస్ తరపున ఒక్కటీ కూడా రాలేదు. కొందరు నేతలు నామినేషన్లు వేసినా, వాటిని విత్ డ్రా చేసేందుకు వారితో మంతనాలు జరుపుతున్నారు కొందరు బీఆర్ఎస్ పెద్దలు.


రేపోమాపో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. లోకల్‌గా సత్తా చాటేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్. అందుకోసం రకరకాల ఎత్తుగడలు వేస్తోంది. కేటీఆర్, హరీష్‌రావు, కవితలు వివిధ జిల్లాలను చుట్టేస్తున్నారు. బీసీ సంఘాల నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాలు బీసీల చుట్టూనే తిరుగుతోంది.

ALSO READ:  తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత.. సాయంత్రం వరంగల్‌‌కు రాహుల్ రాక

ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారమే అధికార పార్టీ కుల గణన చేపట్టింది. సర్వే నివేదికను అసెంబ్లీలో చర్చించింది కూడా. ఒక విధంగా చెప్పాలంటే రేవంత్ సర్కార్ చేసిన అతి పెద్ద సహసం. దేశంలో ఇప్పటివరకు ఏ పార్టీ బీసీలపై కులగణన చేయలేదు. చట్ట పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం కాకపోతే పార్టీ పరంగా ఇస్తామని అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. బీసీలంతా కాంగ్రెస్‌కు వైపు మళ్లుతారని భావిస్తోంది బీఆర్ఎస్.

అదే జరిగితే తమకు మరిన్ని కష్టాలు తప్పవన్నది కొందరు నేతల ఆలోచన. బీసీ కులగణన అంశాన్ని అస్త్రంగా మలచుకోవాలని భావిస్తోంది కారు పార్టీ. కుల గణన ప్రక్రియ సరిగా జరగలేదన్నది బీఆర్ఎస్ వాదన. బీసీలను తగ్గించారని బీఆర్ఎస్ చెబుతుండగా.. పెరిగారన్నది అధికార పార్టీ మాట.

ఈ నేపథ్యంలో కామారెడ్డి వేదికగా సమరశంఖం పూరించాలని భావిస్తోంది కారు పార్టీ. ఈ సభకు కేసీఆర్ హాజరుకాబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడి నుంచే స్థానిక సంస్థల ఎన్నికల సమర శంఖం పూరించాలని ఆలోచన చేస్తోంది. ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ మైలేజ్ వస్తుందని కొందరి నేతల ఆలోచన.

బీసీ సభతో పొలిటికల్‌గా యాక్టివ్ అయితే పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నారు. భారీ ఎత్తున సభ ప్లాన్ చేస్తుండడంతో కొందరు నేతలు ముఖం చాటేస్తున్నట్లు తెలుస్తోంది. నిధులు ఖర్చు పెట్టలేమని చెబుతున్నారట. ఈ విషయాన్ని కారు పెద్దలు ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. మొత్తానికి ‘స్థానిక’పైనే గురి పెట్టింది కారు పార్టీ.

Related News

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Big Stories

×