Manchu Manoj: మంచు మనోజ్(Manchu Manoj) ఇటీవల కాలంలో తరచూ వార్తలలో నిలుస్తున్నారు. ఈయన తన వృత్తిపరమైన జీవితంలో కంటే వ్యక్తిగత జీవితంలో తలెత్తిన వివాదాల వల్ల నిత్యం వార్తలలో ఉంటున్నారు. చాలా రోజుల తర్వాత మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమయ్యారు. మే 30న భైరవం(Bhairavam) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో భాగంగానే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీగా నిర్వహిస్తున్నారు. ఇక మనోజ్ ఏ ఇంటర్వ్యూకి హాజరైన తన ఫ్యామిలీలో జరిగిన గొడవ గురించి తనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తాజగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మనోజ్ గతంలో తన ఇంటి ముందు గొడవ జరిగిన సమయంలో ఓ వ్యక్తిపై దాడి చేసిన సంఘటన గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు మనోజ్ క్లారిటీ ఇచ్చారు.
పెళ్లికి గొడవకు సంబంధం లేదు…
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా మనోజ్ ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. తనకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ అని ఒకప్పుడు ఎక్కువగా ఫ్రెండ్స్ తోనే తాను సమయం గడిపే వాడినని తెలిపారు. ఇక ఈ మధ్యకాలంలో ఇలా ఫ్రెండ్స్ ని కలవడం తానే తగ్గించుకున్నానని, పిల్లలతో టైం గడపడానికి తాను ఇష్టపడుతున్నానని మనోజ్ తెలిపారు. ఇకపోతే ఇంట్లో జరుగుతున్న గొడవలు గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. పెళ్లి తర్వాతనే మీ ఇంట్లో గొడవలు మొదలయ్యాయనే ప్రశ్న ఎదురవడంతో పెళ్లికి ముందే ఈ గొడవలు ఉన్నాయని, అయితే ఇది పూర్తిగా నా పర్సనల్ విషయం కానీ పెళ్లికి ఈ గొడవకు సంబంధం లేదని తెలిపారు.
ఇక ఈ గొడవల కారణంగా గత రెండు సంవత్సరాలుగా తాను ఎన్నో ఇబ్బందులు పడుతున్నానని కూడా మనోజ్ తెలిపారు. ఇలా ఈ ఇబ్బందుల నుంచి బయటపడటం కోసం తాను అమ్మతో కలిసి రిషికేష్ వంటి ప్రాంతాలకు వెళ్లి రిఫ్రెష్ అయ్యానని తెలిపారు. అయితే అక్కడ నాకు ఒక బ్రాహ్మిన్ ఫ్రెండ్ ఉండేవాడని మనోజ్ తెలిపారు. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ కాస్త ఎక్కువ ఎక్కడికి వెళ్ళినా నా క్లాస్మేట్స్ లేదన్నా ఫ్రెండ్స్ ఉంటారని తెలిపారు. మనోజ్ ఇలా బ్రాహ్మిన్ స్నేహితుడు అనగానే యాంకర్ వెంటనే అందుకే ఆరోజు మీ ఇంటి ముందు గొడవ జరుగుతుంటే బ్రాహ్మణ వ్యక్తిని కొట్టారా అంటూ ప్రశ్నించారు.
నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ..
ఇంటి ముందు గొడవ జరిగినప్పుడు అతను ఏ కులం అని నేను చూడలేదు ఇంటిముందు గొడవ చేస్తున్నారు అందుకే కొట్టానని తెలిపారు. ఇంటిముందు జరుగుతున్న గొడవను కాదంటూ ఇంట్లోకి రావడానికి ప్రయత్నిస్తే ముందుగా వారిని నాలుగు తన్ని బయటకు పంపించిన తర్వాతనే ఇతర విషయాల గురించి మాట్లాడతామని తెలిపారు. ఇంట్లో ఆడవాళ్లు చిన్నపిల్లలు అందరూ ఉంటారు అలా నేరుగా ఇంట్లోకి వస్తే కచ్చితంగా ఎవరైనా కొడతారని అందుకే నేను కూడా ఆరోజు కొట్టాను అంటూ మంచు మనోజ్ తన ఇంటి ముందు జరిగిన గొడవ గురించి క్లారిటీ ఇచ్చారు. ఇక భైరవం సినిమా విషయానికి వస్తే… చాలా గ్యాప్ తర్వాత మనోజ్ వెండి తెరపై కనిపించబోతున్నారు. ఇలా ఈ సినిమా ద్వారా మనోజ్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వబోతున్నారని చెప్పాలి. ఇక ఈ సినిమాతో పాటు ప్రస్తుతం పలు ప్రాజెక్టులకు మనోజ్ కమిట్ అయి కెరియర్ పరంగా తిరిగి బిజీ అవుతున్నారు.