BigTV English

Tripti Dimri in Pushpa 2: పుష్పరాజ్ తో అనిమల్ బ్యూటీ త్రిప్తి.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు నేషనల్ క్రష్ లు.. థియేటర్లో పునకాలే..!

Tripti Dimri in Pushpa 2: పుష్పరాజ్ తో అనిమల్ బ్యూటీ త్రిప్తి.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు నేషనల్ క్రష్ లు.. థియేటర్లో పునకాలే..!

Animal Fame Tripti Dimri Doing a Special Song in Allu Arjun’s Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ మంచి హైప్ ను క్రియేట్ చేశాయి. ఈరోజు రిలీజ్ చేసిన సెకండ్ సాంగ్ ప్రోమో కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.


అల్లు అర్జున్ – సుకుమార్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. పుష్ప రాజ్ పాత్రలో బన్నీ నటించాడు అని చెప్పడం కన్నా జీవించాడు అని చెప్పాలి. ఆ నటనకే జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం పుష్ప 2 కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. పుష్ప 2 లో ఐటెంసాంగ్ కోసం మేకర్స్ అనిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రిని రంగంలోకి దింపారట. అనిమల్ సినిమాలో కూడా నేషనల్ క్రష్ రాష్మిక.. కొత్త నేషనల్ క్రష్ త్రిప్తి కనిపించారు. ఇపుడు అదే కాంబో మళ్ళీ స్క్రీన్ పైన కనపడబోతుంది. ఇద్దరు నేషనల్ క్రష్ లు అల్లు అర్జున్ తో ఉంటే థియేటర్లో పునకాలే అని టాక్.. ఇక పుష్ప పార్ట్ 1 లో సమంత ఐటెం సాంగ్ ఏ రేంజ్ రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Also Read: Actress Kavitha: పెళ్లి తరువాత ఆ కండీషన్ పెట్టా.. పిల్లలు పుట్టి చనిపోవడం.. ఎమోషనల్ అయిన కవిత


ఇక అంతకుమించి స్పెషల్ సాంగ్ ఇందులో కూడా ఉండాలని మేకర్స్ అనుకున్నారట. చాలామంది హీరోయిన్స్ ను వెతికి చివరికి త్రిప్తి ని ఓకే చేసారని టాక్ నడుస్తోంది. అనిమల్ సినిమాతో త్రిప్తి.. నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఫ్యాన్స్ ఆమెను బాబీ అని ముద్దుగా కూడా పిలుచుకుంటున్నారు. రణబీర్ తో అమ్మడు చేసిన రొమాన్స్ ను అంత త్వరగా ఎవరు మర్చిపోలేరు. ఇక ఇప్పుడు ఈ భామ బన్నీతో రొమాన్స్ చేయడానికి సిద్దమయ్యింది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా త్రిప్తిని సినిమాలోకి ఆహ్వానిస్తారని సమాచారం. మరి ఈ చిన్నది పుష్ప 2 తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×