BigTV English

Sitara Ghattamaneni Interview: త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తా.. మహేష్ బాబు కూతురు కామెంట్స్ వైరల్

Sitara Ghattamaneni Interview: త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తా.. మహేష్ బాబు కూతురు కామెంట్స్ వైరల్

Mahesh babu’s Daughter Sitara Ghattamaneni Interview: సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణంగా ఏ స్టార్ పిల్లలు అయినా ఒక వయస్సు వచ్చాక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు. కానీ సీతూపాప పుట్టినప్పుడు నుంచే ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. ఇక పెరిగే కొద్దీ సితారకు ఫ్యాన్స్ కూడా పెరుగుతూ వస్తున్నారు.


పదేళ్లు కూడా నిండకముందే సితార ఒక యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి బోల్డన్ని ముచ్చట్లు చెప్పింది. మహేష్ తో పాటు కనిపిస్తూ సందడి చేస్తూ వచ్చింది. ఇంకోపక్క సితార తల్లి నమ్రత.. చిన్నప్పటి నుంచి సితారను అభిమానులకు దగ్గరగా ఉంచడంతో ఆమె ఒక యువరాణిగా మారిపోయింది. ఇక అతి చిన్న వయస్సులోనే సీతూ పాప.. ఇంటర్నేషనల్ ఆభరణాల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో సితార నిత్యం డ్యాన్స్ చేస్తూ.. రీల్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.

తాజాగా సితార సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ తో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు అస్సలు తడుముకోకుండా సమాధానాలు చెప్పుకొచ్చింది. తనకు హీరోయిన్ కావాలని ఉందని చెప్పుకొచ్చింది. ఇక మహేష్ తో తన అల్లరి, తన అన్నను ఏడిపించిన విధానం అన్ని పూసగుచ్చినట్లు తెలిపింది. పెద్ద హీరోయిన్ లా ఎంతో హుందాగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది.


Also Read: Drama Juniors Season 7 Happy Days: ఆర్య వర్ధన్ కొత్త అవతారం.. వారికి పోటీ రాడుగా.. ?

తన తండ్రి సినిమాల్లో తనకు ఖలేజాలోని సీతారామరాజు పాత్ర చేయాలనీ ఉందని చెప్పుకొచ్చింది. అమ్మ, నాన్న, అన్న నుంచి ఏదైనా నేర్చుకోవాలి అంటే.. తల్లి నమ్రత దగ్గరనుంచి ఫ్యాషన్ సెన్స్, తండ్రి మహేష్ నుంచి యాక్టింగ్, అన్న నుంచి ఓపిక నేర్చుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక కొత్తగా వచ్చే యంగ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కు సజిషన్ కూడా ఇచ్చింది. ఎవరికి భయపడకుండా తమకు నచ్చినట్లు మాట్లాడమని, కంఫర్ట్ కూడా చూసుకోమని చెప్పుకొచ్చింది.

ఇక ఈ మధ్యకాలంలో మహేష్- మంజుల మధ్య జరిగిన క్యూట్ ఇన్సిడెంట్ ఎంత వైరల్ అయ్యిందో అందరికి తెల్సిందే. మహేష్ హెయిర్ ను మంజుల ముట్టుకోగానే మహేష్ ఫైర్ అయ్యాడు. అప్పుడు అసలు ఏం జరిగిందో సీతూ పాప తెలిపింది. నాన్న హెయిర్ ను అత్త పట్టుకోగానే.. డోంట్ టచ్ మై హెయిర్ అన్నారని, ఆయనకు తన హెయిర్ ను ఎవరు పట్టుకున్నా ఇష్టం లేదని తెలిపింది. ఇలా ఎన్నో విషయాలను సితార పంచుకుంది. సీతూ పాప కోరిక మేరకు త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×