BigTV English

Pinnelli Anticipatory Bail Petition Updates: పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు!

Pinnelli Anticipatory Bail Petition Updates: పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు!

AP high court on MLA Pinnelli bail petition(AP news live): పిన్నెల్లి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 5 ఉదయం 10 గంటల వరకు ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసినట్లు సమాచారం.


దీంతో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. అయితే ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసినట్లు తెలుస్తోంది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని ఆదేశిస్తూ తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

అయితే, పిన్నెలి రామకృష్ణారడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ ను దాఖలు చేయగా, ఆయన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు విచారించి కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. పిటిషనర్లు దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఉత్తర్వుల్లో ఆదేశించినట్లు సమాచారం.


కాగా, పోలింగ్ రోజు వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రెంటచింతల మండలం పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్ లను ధ్వంసం చేసిన ఘటనపై ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, ఐపీసీ, పీడీపీపీ చట్టాల పరిధిలో 10 సెక్షన్లతో పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్యే పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అనుమానించిన పోలీసులు అన్ని ఎయిర్ పోర్టులను అప్రమత్తం చేసి లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం విధితమే. 8 బృందాలుగా ఏర్పడి పిన్నెల్లి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పిన్నెల్లి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.

Also Read: ఏపీలో భారీ వర్షాలు.. ఎప్పట్నుంచంటే..?

అదేవిధంగా పాల్వాయి గేట్ ఘటనే కాదు.. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి ఆదేశాలతో కొత్తపుల్లారెడ్డిగూడెంలోనూ పోలింగ్ బూత్ లో కూడా టీడీపీ ఏజెంట్లుగా ఉన్నవారిపై వైసీపీ మూకలు దాడిచేశాయని టీడీపీ శ్రేణులు పేర్కొన్న విషయం తెలిసిందే.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×