BigTV English

Actress Kavitha Emotional: పెళ్లి తరువాత ఆ కండీషన్ పెట్టా.. పిల్లలు పుట్టి చనిపోవడం.. ఎమోషనల్ అయిన నటి కవిత

Actress Kavitha Emotional: పెళ్లి తరువాత ఆ కండీషన్ పెట్టా.. పిల్లలు పుట్టి చనిపోవడం.. ఎమోషనల్ అయిన నటి కవిత
Advertisement

Actress Kavitha Emotional Words about Personal Life: సీనియర్ హీరోయిన్ కవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోల సినిమాల్లో కవిత ఎన్నో మంచి పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు కూడా బుల్లితెరపై సీరియల్స్ లో కనిపిస్తూ మెప్పిస్తుంది. ఇకపొతే గతంలో కవిత మరణించిందని వార్తలు కూడా పుట్టుకొచ్చాయి. కొన్నిరోజులు యూట్యూబ్ కు కనిపించకపోతే బతికున్నవారిని కూడా చంపేస్తున్న విషయం తెల్సిందే. తన మరణ వార్తలను ఆమె ఖండించింది. ఇలాంటి చెత్త వార్తలు రాయొద్దు అని చెప్పడంతో అప్పట్లో ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది.


ఇక తాజాగా నటి కవిత ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన కెరీర్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. పెళ్లి తరువాత.. పాప పుట్టిన తరువాత తన జీవితం మొత్తం మారిపోయిందని తెలిపింది. పెళ్ళి తరువాత తన భర్తకు పెట్టిన కండీషన్ గురించి చెప్పుకొచ్చింది. ” నా భర్త పేరు దశరథ్. నాకు ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. 1983లో మా వివాహం జరిగింది. పెళ్లి తరువాత మా వారికీ నేను ఒక కండీషన్ పెట్టాను. ఎ

ట్టి పరిస్థితిలో కూడా నేను పిల్లలను కనను అని.. అది విని మావారు జోక్ చేస్తున్నాని నవ్వారు. కానీ, నేను సీరియస్ గానే చెప్పాను. అందుకు కారణం మా తమ్ముడు చనిపోవడం. వాడు చనిపోయాక ఆ జ్ఞాపకాల నుంచి బయటికి రాలేదు. ఆ సంఘటన నా మైండ్ లో నాటుకుపోయింది. అతన్ని మర్చిపోలేక.. అలాగే నాకు అవుతుందని పిల్లలు వద్దు అని చెప్పాను. మా అత్తగారు పిల్లల్ని ఎప్పుడు కంటావ్ అని అడిగినప్పుడల్లా.. మా అమ్మ దగ్గరకు వెళ్లి పిల్లలు వద్దు అని చెప్పేదాన్ని.


Also Read: Sudigali Sudheer New Show: ఫ్యామిలీ స్టార్స్ తో వస్తున్న ఫ్యామిలీ స్టార్.. అదిరిపోయిన ప్రోమో

పిల్లలు పుడితేనే కదా చనిపోయేది.. పుట్టకపోతే ఏం ఉండదు కదా అని చెప్తే అందరూ ధైర్యం చెప్పారు. చివరికి నేను ప్రెగ్నెంట్ అయ్యాను. నా కూతురు పుట్టాకా జీవితం మారిపోయింది. ఆమె నా ప్రపంచం. మొత్తం నాకు ముగ్గురు పిల్లలు. కరోనా సమయంలో నా భర్త, కొడుకు చనిపోయారు. వారి లేని లోటు నాకు ఇంకా తెలుస్తోంది” అని కవిత కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Related News

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×