BigTV English
Advertisement

Tollywood Directors : ఫస్ట్ మూవీ సూపర్ హిట్.. రెండో సినిమా ఫట్..జోరు తగ్గని డైరెక్టర్స్ వీళ్లే..!

Tollywood Directors : ఫస్ట్ మూవీ సూపర్ హిట్.. రెండో సినిమా ఫట్..జోరు తగ్గని డైరెక్టర్స్ వీళ్లే..!

Tollywood Directors : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఎలా ఉంటారో అలాగే స్టార్ దర్శకులు కూడా ఉంటారు. కొందరు హీరోలు ఆ డైరెక్టర్లతోనే వరుసగా సినిమాల చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఆ సినిమాలు హిట్ అవ్వవు.. కానీ డైరెక్టర్ తో సినిమాలు చేస్తున్నారు.. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఆ డైరెక్టర్ ని హీరోలు వదలడం లేదు.. ఆ హీరో కాకపోతే మరో హీరో డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఒప్పుకుంటున్నారు.. అదే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ . ఇటీవల హీరోలు డైరెక్టర్లను మార్చి సినిమాలు చేస్తున్నారు. ఇకపోతే మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యి, రెండో సినిమా ఫ్లాప్ అయిన డైరెక్టర్లు ఎవరు? వాళ్ళు తీసిన సినిమాలేంటో? ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


అజయ్ భూపతి.. 

ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు అజయ్ భూపతి.. ఈయన తీసిన మొదటి సినిమా బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది. ఇక ఆ తర్వాత వచ్చిన శర్వానంద్ తో మహాసముద్రం మూవీని చేశారు.. ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ మంగళవారం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఆ మూవీ హిట్ అవడంతో పాటు కలెక్షన్స్ ని కూడా అందుకుంది. అంతేకాదు అవార్డును కూడా అందుకోవడం విశేషం.


సుజిత్.. 

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజిత్ గురించి అందరికీ తెలుసు.. ఈయన శర్వానంద్ తో రన్ రాజా రన్ సినిమాను తెరకెక్కించారు. మూవీ మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెండో చిత్రంగా సాహూ చేశారు.. హీరో ప్రభాస్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయినా డైరెక్టర్ కి అవకాశాలు రాకుండా పోలేదు.

ప్రశాంత్ వర్మ..

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు.. గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. నిజానికి ఈ డైరెక్టర్ మొదటి సినిమా ఆ!.. నితిన్ సమంత ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా వచ్చిన సినిమాలు బాగానే ఆకట్టుకున్నాయి..

కరణ్ కుమార్.. 

టాలీవుడ్ ఇన్ డైరెక్టర్లలో కరణ్ కుమార్ ఒకరు.. ఈయన ‘పలాస’ చిత్రంతో మంచి హిట్ ను అందుకున్న దర్శకుడు కరుణ్ కుమార్, రెండో చిత్రంగా సుధీర్ బాబుతో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ను తిరగకెక్కించాడు. మధ్యలో గ్యాప్ వస్తే ‘మెట్రో కథలు’ అనే ఓటిటి ప్రాజెక్టు కూడా చేశాడు కానీ, రెండో చిత్రంగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ ని పరిగణించాలి. ఈ సినిమా ప్లాప్ అయ్యింది..

ఇక తేజ మార్ని.. ‘జోహార్’ చిత్రంతో ఓటీడీలో హిట్ అందుకుని టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్న దర్శకుడు తేజ మార్ని, రెండో చిత్రం ‘అర్జున ఫాల్గుణ’ తో ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. వీళ్లే కాదు చాలామంది డైరెక్టర్లు ఉన్నారు… ఇందులో కొందరు పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×