Summer Travel Tips: ప్రయాణం అనేది ఒక మరచిపోలేని అనుభవం మాత్రమే కాదు.. ఇది అనేక సవాళ్లను కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా సమ్మర్ లో వివిధ ప్రదేశాలు వెళ్లడానికి చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా మొదటి సారి మీరు ఫ్యామిలీతో బయటకు వెళ్తుంటే మాత్రం కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. కుటుంబంతో కలిసి ప్రయాణించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి కుటుంబానికి భద్రత , సౌకర్యాన్ని అందిస్తాయి. అంతే కాకుండా మీరు సేఫ్‌గా ట్రిప్ పూర్తి చేసుకుని రావడానికి ఉపయోగపడతాయి.
చాలా సార్లు మనం దూర ప్రాంతాలకు వెళ్లాలని అనుకున్నప్పుడు చిన్న చిన్న విషయాలను పట్టించుకోము. కానీ ఇవి తరువాత ఇబ్బందులకు దారితీస్తాయి. అందుకే టూర్ వెళ్లేటప్పుడు కొన్ని గుర్తుంచుకోవాల్సిన ఏడు ముఖ్యమైన విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రయాణానికి ముందు.. మీరు వెళ్లే ప్లేస్, ప్రయాణ సమయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోండి. ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి ఇది చాలా ముఖ్యం. మీరు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే గనక స్టాప్‌లు, విశ్రాంతి తీసుకునే ప్రదేశాలను గురించి ముందుగానే సమాచారం సేకరించండి.
అవసరమైన పేపర్స్ ఉంచండి:
ప్రయాణించే ముందు.. మీ పాస్‌పోర్ట్, టిక్కెట్లు, హోటల్ బుకింగ్‌లు , గుర్తింపు కార్డులకు సంబంధించిన ప్రింట్ లు తీసుకోండి. అలాగే..ఇవి ఫోన్ లో కూడా సురక్షితంగా ఉంచుకోండి. ఏదైనా అత్యవసర పరిస్థితిలో ఇది సహాయపడుతుంది. ప్రయాణ సమయంలో ఏవైనా ఇబ్బందులను నివారించడంలో ఉపయోగపడుతుంది.
మందులు వెంట తీసుకెళ్లండి:
ప్రయాణించేటప్పుడు మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్తగా తీసుకోండి. మీతో పాటు సాధారణంగా వాడే మందులను వెంట తీసుకెళ్లండి. అంతే కాకుండా మీరు ప్రయాణించే దూరాన్ని బట్టి , సీజన్ ను బట్టి అవసరం అయిన ఏర్పాట్లు ముందుగానే చేసుకోండి.
స్థానిక సంస్కృతి, ఆచారాలను గౌరవించండి:
ప్రతి ప్రదేశానికి దాని స్వంత సంస్కృతి, ఆచారాలు ఉంటాయి. టూర్ వెళ్లే ముందు ఆ ప్రాంత సంస్కృతి, స్థానిక ఆచారాల గురించి ముందుగానే తెలుసుకోండి. ఇది మీ ప్రయాణాన్ని ఆనందదాయకంగా మార్చడమే కాకుండా స్థానిక ప్రజలతో మంచి సంబంధాలను కొనసాగించడంలో మీకు సహాయపడుతుంది.
లగేజ్ ప్యాక్ చేయండి:
ట్రిప్‌కు బయలుదేరే ముందు మీ లగేజీని జాగ్రత్తగా ప్యాక్ చేయండి. డబ్బు, డాక్యుమెంట్లు, విలువైన వస్తువులు వంటి వాటిని సురక్షితమైన స్థలంలో ఉంచండి. అలాగే.. ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా బరువైన సామానును వీలైనంత వరకు తీసుకువెళ్ళకుండా ఉండండి. తక్కువ లగేజ్‌తో ప్రయాణించడం ఎప్పుడూ మంచిదే.
Also Read: మైసూర్ వెళ్తున్నారా ? చూడాల్సిన బెస్ట్ ప్లేస్‌లు ఇవే
స్థానిక సమాచారం:
ప్రయాణించేటప్పుడు అత్యవసర పరిస్థితుల కోసం స్థానిక పోలీసులు, ఆసుపత్రి, అంబులెన్స్‌ల కాంటాక్ట్ నంబర్‌లను సిద్ధంగా ఉంచుకోండి. అలాగే.. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు లోకేష్ల గురించి తెలియజేయండి.
ఆహారం తినే ముందు జాగ్రత్త:
కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు స్థానికంగా దొరికే ఆహారాన్ని రుచి చూడటం ఒక అద్భుతమైన అనుభవమే కానీ కొత్త ఆహారం మీ కడుపుకు అంత మంచిది కాకపోవచ్చు. ఇలాంటి సమయంలో శుభ్రమైన ప్రదేశాలలో తయారు చేసిన ఆహారం మాత్రమే తినండి.