IND vs ENG: టీమిండియా ( team india ) వర్సెస్ ఇంగ్లాండ్ ( england ) మధ్య 5 t20 ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ ఇప్పటికే టీమిండియా 3-1 తేడాతో గెలుచుకుంది. అయితే ఇవాళ ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య చిట్టచివరి టి20 జరగనుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్క్ ప్రక్రియ…. కాసేపటి క్రితమే ముగిసింది. అయితే ఇందులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.
Also Read: South Africa In T20 World Cup: దరిద్రం అంటే ఇదే… నాలుగు సార్లు ఫైనల్లో ఓడిన సౌత్ ఆఫ్రికా?
నాల్గవ టి20 మ్యాచ్ లో కూడా ఇంగ్లాండ్ జట్టు టాస్ నెగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చివరి టి20 లో కూడా అదే పరిస్థితి నెలకొంది. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బౌలింగ్ చేయనుండగా… టీమిండియా మొదట బ్యాటింగ్ చేసేందుకు రెడీ అయింది. అయితే ఇవాల్టి మ్యాచ్లో పలు కీలక మార్పులు చేసింది టీం ఇండియా. మరోసారి… మహమ్మద్ షమిని ( Mohammed Shami ) జట్టులోకి తీసుకువచ్చారు సూర్యకుమార్ యాదవ్. ఫాస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్… స్థానంలో మహమ్మద్ షమీ ( Mohammed Shami ) జట్టులోకి రావడం జరిగింది. ఇక మిగతా ప్లేయర్ లందరూ… కామన్ గానే ఉన్నారు.
ఇది ఇలా ఉండగా… పూణే వేదికగా జరిగిన నాలుగవ టి20 మ్యాచ్ లో… అద్భుతంగా ఆడి టీం ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే శివం దూబే స్థానంలో హర్షిత్ రానా జట్టులోకి వచ్చి… మ్యాచ్ మొత్తాన్ని టీమిండియా వైపు తీసుకువచ్చాడు. వాస్తవంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శివం దూబేకు… గాయమైంది. ఈ నేపథ్యంలోనే కంకషన్ సబిస్టిట్యూడ్ ( concussion substitute ) అనే రూల్ ద్వారా… శివం దుబే స్థానంలో హర్షిత్ రానా జట్టులోకి వచ్చాడు.
జట్టులోకి ఎంట్రీ ఇవ్వగానే టప టప అని వికెట్లు తీశాడు. తన ఓవర్ల కోటాలో ఏకంగా మూడు వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చాడు హర్షిత్ రానా. ఇందులో.. కీలకమైన వికెట్లు ఉండడం గమనార్హం. ఈ దెబ్బకు ఇంగ్లాండ్ దారుణంగా ఓడిపోయింది. అయితే ఓటమి అనంతరం.. హర్షిత్ రానా ఎంట్రీపై ఇంగ్లాండ్ ప్లేయర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. హర్షిత్ రానా రావడం వల్లే ఇంగ్లాండ్ ఓడిపోయిందని వాళ్లు వాదన వినిపించారు.
Also Read: Rajeev Shukla – Dhoni: రాజకీయాల్లోకి ధోని.. BCCI సంచలన ప్రకటన !
భారత్ ప్లేయింగ్ 11: సంజూ శాంసన్( వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రింకు సింగ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి
ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), బెన్ డకెట్, జోస్ బట్లర్(కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టోన్, జాకబ్ బెతెల్, బ్రైడాన్ కార్సే, జేమీ ఓవర్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్