BigTV English
Advertisement

Kuberaa: 10 రోజుల్లో రిలీజ్, ఇంకా రెండు పాటలు పెండింగ్

Kuberaa: 10 రోజుల్లో రిలీజ్, ఇంకా రెండు పాటలు పెండింగ్

Kuberaa: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులను శేఖర్ కమ్ముల ఒకరు. డాలర్ డ్రీమ్స్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శేఖర్. ఈ సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది కానీ కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆనంద్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాను మొదట చాలామందికి చెప్పాడు. కానీ ఎవరో కూడా ఈ సినిమాని పూర్తిగా నమ్మలేదు. ఒకానొక సందర్భంలో దర్శకుడు కృష్ణవంశీకి కూడా ఈ సినిమా కథని చెప్పాడు శేఖర్. అయితే ఇంటర్వెల్ వరకు విన్న కృష్ణవంశీ సినిమా అయిపోయిందా అని అడిగారట. ఎంతమంది రిజెక్ట్ చేసినా కూడా శేఖర్ కమ్ముల తన శైలిని మార్చుకోకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. మొత్తానికి ఈ సినిమాను పూర్తి చేసి మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకు పోటీగా విడుదల చేశారు. వాస్తవానికి ఇది కావాలని చేయకుండా ఏదో యాదృచ్ఛికంగా అలా జరిగిపోయింది.


ఆనంద్ ఓ మంచి కాఫీలాంటి సినిమా 

ఆనంద్ సినిమాకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు అప్పట్లో కొనడానికి కూడా సిద్ధంగా లేరు. ఒకపక్క మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉంటే మరోపక్క ఆనంద్ అంటావేంటి అన్న వాళ్లు కూడా ఉన్నారు. అయితే శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాకి టికెట్ దొరకని వాళ్ళు ఈ సినిమాకి వస్తారు అనే ఒక నమ్మకం కూడా మరోవైపు శేఖర్ కమ్ములకు ఉంది. అలానే శేఖర్ ఆలోచన కూడా నిజమైంది. ఈ సినిమా చూసిన చాలామంది ఈ సినిమాను ప్రశంసించడంతోపాటు, చాలామందికి ఈ సినిమా ఒక గొప్పతనాన్ని తెలిపారు. ఈ సినిమా తర్వాత శేఖర్ చేసిన సినిమాలన్నీ కూడా మంచి పేరును సాధించాయి. ముఖ్యంగా శేఖర్ కమ్ముల అంటే చాలామందికి గుర్తొచ్చే సినిమా హ్యాపీ డేస్. సినిమా చూసి చాలామంది స్టూడెంట్స్ కూడా ఇంజనీరింగ్ లో జాయిన్ అయిపోయారు అని ఇప్పటికే అంటుంటారు. ఇక ప్రస్తుతం శేఖర్ కుబేర అనే సినిమాను చేస్తున్నాడు.


రెండు పాటలు పెండింగ్ 

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ కుబేర అనే సినిమా చేస్తున్నట్లు చాలా రోజుల క్రితం అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఏడాదిన్నర క్రితం షూటింగ్ మొదలైంది. ఈ సినిమా జూన్ 20న రిలీజ్ కి సిద్ధమవుతుంది. ఈ తరుణంలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాడు నిర్మాత సునీల్. ఆయనే పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటూ సినిమా గురించి చెబుతున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఇంకా రెండు పాటలు దేవి ఇవ్వలేదు అని తెలుస్తుంది. అయితే కేవలం పది రోజులు మాత్రమే ఉన్న తరుణంలో పాటల పూర్తి కాకపోవడం పై చిత్ర యూనిట్ నిరాశలో ఉంది. అయితే ఈ పది రోజుల్లో ఈ సాంగ్స్ పూర్తి చేసి దేవి అందిస్తారో లేకపోతే శేఖర్ సినిమా డేట్ అండ్ పోస్ట్ పోన్ చేస్తారా అని కొన్ని రోజుల్లో తెలియనుంది.

Also Read: Harish Shankar : హరీష్ శంకర్ కు భగవంతుడు విముక్తి కలిగించాడు

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×