Watch Video: ఈ రోజుల్లో అన్నీటికన్నా విలువైనది డబ్బు. అది లేనిదే ఏ పని జరగదు. డబ్బు మనిషిని ఏవిధంగానైనా మారుస్తుంది. దాని కోసం మనిషి ఏం చేయడానికి అయిన వెనుకాడడం లేదు. కొందరు మనీ కోసం ఏకంగా.. చంపుకుంటున్నారు. సొంత అన్నదమ్ములు సైతం పైసల విషయంలో దూరం అవుతున్నారు. చాలా మంది దొంగతనాలకు పాల్పడుతున్నారు. కొంతమంది అయితే.. మనీ కోసం రోజుకో వేషం మారుస్తున్నారు. ఇలా ప్రపంచమంతా ఈ డబ్బు చుట్టే తిరుగుతోంది. అయితే.. ఓవ్యక్తి డబ్బు కోసం గంగానదిలో బురదను జల్లడించి కరెన్సీ నోటు, నాణేలు సేకరించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Jitni Pakistan ki GDP hai, utna toh Hindu Ganga me arpit kar deta hai 😂 pic.twitter.com/1luMmJJuos
— Meme Farmer (@craziestlazy) June 8, 2025
భారతదేశంలో గంగానది చాలా పవిత్రమైనదిగా మనం చెప్పుకుంటాం. ఇది దేశంలో అనేక సాంస్కృతిక, మతపరమైన, సామాజిక అంశాలకు సంబంధించి ముఖ్యమైనది. గంగానదిలో స్నానం చేస్తే పాపాలు తొలిగిపోయి.. మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం. గంగానది పరీవాహక ప్రాంతం సారవంతమైన భూమికి నిలయం. ఇది భారతదేశపు వ్యవసాయానికి చాలా ముఖ్యం. దేశంలో లక్షల మందికి జీవనోపాధిని అందిస్తుంది. ఇది నీటిపారుదల, తాగునీరు, రవాణా లాంటి అవసరాలకు ఉపయోగపడుతోంది. అయితే ఓ వ్యక్తి గంగా నది తీరంలో ఓ ఐరన్ రాడ్‌క, జాలి సాయంతో బురదను తీసిన వీడియో సోషల్ మీడియో వైరలవుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ALSO READ: పాములు లేని ఆ అందమైన దేశం.. వీడియో మస్త్ వైరల్
ఆ వ్యక్తి నదీ తీరంలో ముందుగా.. ఐరన్ రాడ్, జాలి సాయంతో బురదను తీస్తూ కనిపించాడు. అయితే బురదను తీస్తున్నప్పుడు వీడియోను చూసిన నెటిజన్లకు.. ఇదేంటి బురదను తీస్తున్నాడని డౌట్ వచ్చే ఉంటుంది. అయితే బురదను నీటిలో వేరు చేసి.. చివరకు దాని నుంచి రూ.200 నోటు, కొన్ని రూ.1, రూ.2, రూ.5 నాణేలు కనిపించాయి. దీంతో అందరూ షాక్‌కు గురయ్యారు. వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. పలు విధాలుగా స్పందిస్తున్నారు. నీ పనే బాగుంది బ్రో.. ఈజీగా డబ్బులు సంపాదిస్తున్నవ్ అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ఇలానే ప్రయత్నించు ఏదో ఓ రోజు బంగారమే దొరకచ్చు.. ప్రయత్నం మానద్దు అని కామెంట్ చేసుకొచ్చారు. పాకిస్థాన్ మొత్తం జీడీపీ విలువ ఎంత ఉంటుందో.. గంగా నదికి భారతీయులు అంతే విలువైన సంపదను విరాళంగా ఇస్తారని ట్విట్టర్ వేదికగా మరొకరు రాసుకొచ్చారు.
ALSO READ: చెట్టు నుంచి నీళ్లు.. దేవుడి మహిమేనా?
ఇలా ఈ వ్యక్తి రోజుకు సులభంగా రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదిస్తాడు. అయితే ఈ బురదలో ఆ వ్యక్తి నాణేలు, కరెన్సీ నోట్లను సేకరించడం చిన్న విషయమే అయినప్పటికీ.. ఇది గంగానది గొప్పతనం గురించి తెలియజేస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లను నది ఒడ్డున జరిగే అనూహ్య సంఘటనల గురించి ఆలోచించేలా చేస్తోంది. ఈ వీడియో గంగా నది సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. లక్షల మంది ఈ వీడియోను వీక్షిస్తున్నారు. ఇది చూసిన నెటిజన్లు గంగా నదితో తమకున్న అనుబంధాన్ని షేర్ చేసుకుంటున్నారు.