Udit Narayan: సినీ సెలబ్రిటీలు పబ్లిక్‌లోకి వచ్చినప్పుడు లేదా స్టేజ్ ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి లేదా వారి ప్రవర్తన వారికి ఎన్నో సమస్యలను తెచ్చిపెడుతుంది. పైగా దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడానికి పెద్దగా ఎక్కువ సమయం పట్టదు. తాజాగా సీనియర్ సింగర్ అయిన ఉదిత్ నారాయణ్ చేసిన పని కూడా అలాగే వైరల్ అయ్యింది. తాను ఒక కాన్సర్ట్‌లో పడుతున్నప్పుడు ఒక ఫ్యాన్ వచ్చి సెల్ఫీ అడగగా.. తనకు నవ్వుతూ సెల్ఫీ ఇచ్చాడు ఈ సీనియర్ సింగర్. ఆపై తనను పెదాలపై ముద్దుపెట్టుకున్నాడు. దీంతో ఉదిత్ నారాయణ్‌పై చాలా నెగిటివిటీ ఏర్పడింది. తాజాగా దీనిపై ఆయన స్పందించాడు.
సింగర్ కాంట్రవర్సీ
మామూలుగా సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ లైఫ్‌లో పెద్దగా కాంట్రవర్సీలు ఉండవు. వారు ఎక్కువగా లైమ్‌లైట్‌లోకి రారు కాబట్టి వారిపై కాంట్రవర్సీలు కూడా తక్కువే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు వారు చేసే పనుల వల్ల అనవసరంగా చిక్కుల్లో ఇరుక్కుంటారు. మామూలుగా ఏ సింగర్ కాన్సర్ట్ ఏర్పాటు చేసినా మ్యూజిక్ లవర్స్ లక్షల్లో హాజరవుతారు. వారి పాటలను లైవ్‌గా చూసి ఎంజాయ్ చేస్తారు. ఇక ఉదిత్ నారాయణ్ లాంటి సీనియర్ సింగర్ అయితే తన కాన్సర్ట్‌కు మరింత పాపులారిటీ ఉంటుంది. అందుకే నెల రోజుల క్రితం జరిగిన ఉదిత్ నారాయణ్ కాన్సర్ట్‌కు చాలామంది ఫ్యాన్స్ వచ్చారు. అక్కడ ఒక ఫ్యాన్‌కు తను పెదాలపై ముద్దుపెట్టడం పెద్ద కాంట్రవర్సీనే క్రియేట్ చేసింది.
నేను పట్టించుకోను
‘‘నేను దాదాపు 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు అదే నాకు ముఖ్యం. నేను రైతు కుటుంబం నుండి వచ్చాను. ఏ సహాయం లేకుండా ఇంత వరకు ఎదిగాను. నేను నా కలలను నమ్ముకొని సొంతంగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. ఇప్పటివరకు నేను రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్నాను. ఎన్నో పాటలు పాడాను. భారత రత్న సాధించిన లతా మంగేష్కర్‌తో కలిసి దాదాపుగా 200 నుండి 300 పాటలు పాడాను. ఇంత కష్టపడి పైకొచ్చిన తర్వాత నేను గతంలో చేసినదాన్ని తవ్వి దానిని ప్రేక్షకులు హేళన చేస్తే నేను దానిని పెద్దగా పట్టించుకోను. వైరల్ అవుతున్న వీడియోలో ఫ్యాన్స్ అంతా వారి ప్రేమ, ఆదరణ చూపిస్తున్నారు అంతే’’ అంటూ విషయాన్ని చాలా సింపుల్‌గా తేల్చేశారు ఉదిత్ నారాయణ్ (Udit Narayan).
Also Read: గత అయిదేళ్లుగా నరకం అంటే ఏంటో చూస్తున్నాను – మంచు డాటర్
నేనే నవ్వుకున్నారు
‘‘ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ప్రేక్షకులంతా దానిపై జోకులు వేశారు. నేను షాకయ్యాను, నవ్వుకున్నారు. నా భార్య దీపా నాతో పాటు చాలావరకు కాన్సర్ట్స్‌కు వస్తుంది. నాపై జనాలు చూపించే ప్రేమ చూసి సంతోషిస్తుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు నా ఫ్యామిలీని కూడా ఎఫెక్ట్ చేయవు’’ అని చెప్పుకొచ్చాడు ఉదిత్ నారాయణ్. మొత్తానికి ఉదిత్ నారాయణ్ చేసిన పని మాత్రం కరెక్ట్ కాదని చాలామంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఈ విషయంపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్, రీల్స్ కూడా వచ్చాయి.