రెడ్ షాట్ అనే పానీయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇది ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు అందాన్ని కూడా ఇస్తుందని చెబుతున్నారు. నిజానికి రెడ్ షాట్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెడ్ షాట్ తయారీలో క్యారెట్, బీట్ రూట్, దానిమ్మ, ఖర్జూరాలు వంటివి వినియోగిస్తారు. ఈ నాలుగు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. కాబట్టి దీన్ని శక్తివంతమైన పానీయంగా చెప్పుకోవచ్చు.
శరీరానికి అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు అవసరం. ఇవన్నీ కూడా ఈ క్యారెట్, బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరాలలో ఉంటాయి. వీటితో కలిపి చేసిన రెడ్ షాట్ ప్రతిరోజు ఒక గ్లాసు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు అందుతాయి.
క్యారెట్
రెడ్ షాట్ లో వాడిన క్యారెట్లు కంటి చూపును మెరుగు పరుస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. దీనిలో బీటా కెరాటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో చేరాక విటమిన్ ఏగా మారుతుంది. ఇది దృష్టి సమస్యలు, అంధత్వం వంటివి రాకుండా కాపాడుతుంది. రేచీకటి వచ్చే అవకాశాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. క్యారెట్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ ఆరోగ్యంగా సాగుతుంది. పేగు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది.
బీట్ రూట్
ఎర్రటి దుంప బీట్ రూట్లో ఇనుము, నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించి రక్తప్రసరణను నియంత్రించడంలో సహాయపడతాయి. బీట్రూట్ లో రక్తనాళాలను సడలించి నైట్రేట్లను నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తాయి. శరీరంలో ఆక్సిజన్ తో కూడా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.
దానిమ్మ
రోజూ ఒక దానిమ్మ తింటే అది గుండెకు ఎంతో మేలు జరుగుతుంది. దానిమ్మ గింజల్లో పాలీఫెనాన్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. గుండె వ్యాధులు నుండి రక్షిస్తాయి. అలాగే దాని మూలాలు ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు రక్షణగా నిలుస్తాయి. దాన్ని పనులు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గిపోతాయి. రక్తపోటు పెరుగుతుంది. గుండె బలంగా మారుతుంది.
ఖర్జూరాలు
ఖర్జూరాల్లో సహజమైన చక్కెర ఉంటుంది. అవే గ్లూకోజ్, ప్రక్టోజ్, సుక్రోజ్ వంటివి. ఇవి శరీరానికి తిన్న వెంటనే శక్తిని అందిస్తాయి. అలాగే ఖర్జూరాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ కూడా బలంగా ఉంటుంది. ఇవి మలబద్దకాన్ని నివారిస్తాయి. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండడం వల్ల కండరాల పనితీరు చక్కగా ఉంటుంది.
ప్రతిరోజూ ఈ రెడ్ షాట్‌ను తీసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఎందుకంటే ఖర్జూరం, బీట్రూట్, క్యారెట్ వంటి దుంపల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణక్రియ సవ్యంగా సాగుతుంది. అలాగే ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. దానిమ్మలో, బీట్రూట్లలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి శరీరాన్ని సూక్ష్మజీవుల నుంచి కాపాడేందుకు సహాయపడతాయి. ఇందులో ఉండే క్యారెట్లు, దానిమ్మ పండ్ల వల్ల డిటాక్సిఫికేషన్ జరుగుతుంది. అంటే శరీరం శుభ్రపడుతుంది. ఇక బీట్రూట్ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. కాబట్టి ప్రతి రోజు ఈ పానీయం తీసుకుంటే మీకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Also Read: జుట్టు ఆరోగ్యంగా నల్లగా ఎదగాలంటే కలబంద, కర్పూరం కలిపి ఇలా చేయండి
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. బీట్రూట్లో ఉండే ఐరన్, దానిమ్మలో ఉండే విటమిన్ సి, క్యారెట్ లో ఉండే విటమిన్ ఏ అన్ని కలిసి చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు వంటివి తగ్గిస్తాయి. చర్మానికి మెరుపును అందిస్తాయి. కాబట్టి మీరు అందంగా ఉండాలనుకుంటే ప్రతిరోజు ఈ రెడ్ షాట్ తాగేందుకు ప్రయత్నించండి.