Intinti Ramayanam Today Episode December 26th: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతి దగ్గరకు భానుమతి ప్రతి ఏడాది అక్షయకు నువ్వే తలకు నూనె పెట్టి స్నానం చేయించి బర్త్డేని గ్రాండ్గా చేస్తావు ఈసారి అవకాశం కూడా నీకు నీ కోడలు ఇవ్వలేదు. ఎప్పుడు నేను అవని నేను ఏదైనా అంటే నన్ను అపార్థం చేసుకుంటున్నామని తిట్టేది ఇప్పుడేంటి అర్థమైందా అనేసి అడుగుతుంది. దానికి పల్లవి మాత్రం స్నానం ఒక్కటి అక్క చేయిస్తుంది. మిగిలిన సెలబ్రేషన్స్ అంతా అత్తయ్య చేస్తుంది కదా అందులో తప్పేంటి అని అంటుంది. అప్పుడు భానుమతి ఏమో ఎవరికి తెలుసు అనేసి అనగానే పార్వతి లోపలికి వెళ్ళిపోతుంది.. డ్రెస్ ని బయటపడేస్తుంది అవని ఎందుకు అడ్రస్ ని బయటపడేసావంటే అది చిరిగిపోయింది అత్తయ్య పుట్టినరోజు నాడు అది వేసుకోవడం ఎందుకని పడేసానని చెప్తుంది ఇక అది చూసిన భానుమతి పల్లవి డ్రస్సును తీసుకొచ్చి డ్రస్సు ఒక్క చినుకు కూడా లేదు బాగానే ఉంది కదా ఎందుకు పడేసింది నువ్వు ఇవ్వడం ఇష్టం లేదేమో అనేసి అనుమానం పెంచుతారు. ఇక పార్వతి అక్షయ్ కు మంచి గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటుంది. రాజేంద్రప్రసాద్ కమల్ కలిసి కారును గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటాడు. అక్షయ్ పైనుంచి కిందికి వస్తాడు. డ్రెస్ కాకుండా అవన్నీ ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాడు అంటే పుట్టినరోజు నాడు అక్షయ్ బాధపడతాడు. ఈ విషయం గురించి చెప్పకపోవడమే మంచిదని పార్వతి ఆలోచిస్తుంది.. ఇక అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు అక్షయ్. అవని వెళ్లి అక్షయ కోసం స్వీట్ తీసుకురా పో అనగానే నేను స్వీట్ చేయడం మర్చిపోయాను అనేసి అంటుంది కానీ పార్వతి మాత్రం స్వీట్ నేను చేసి పెట్టాను అనేసి తీసుకొస్తుంది అందరూ స్వీట్ పెట్టి అక్షయకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతారు.. అవనికి కూడా స్వీట్ పెట్టమని కమల్ చెబుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బామ్మర్ది రాజేంద్రప్రసాద్ కి ఫోన్ చేసి తాగడానికి డబ్బులు కావాలని డిమాండ్ చేస్తాడు లేదంటే ఇంటికొచ్చేస్తానని అంటాడు కానీ రాజేంద్రప్రసాద్ నీ బెదిరింపులకు భయపడేవాన్ని కాదు ఒక్క రూపాయి కూడా నీకు ఇవ్వను అనేసి అంటాడు. నీకు ఫోన్ చేస్తే ఎందుకు అలా అంటావ్ డైరెక్ట్ గా ఇంటికి వస్తేనే ఆ విషయం ఏంటో తేలిపోతుందని బెదిరిస్తాడు నీ ఇష్టం వచ్చిన చేసుకొని రాజేంద్రప్రసాద్ అంటాడు. ఇక వ్యక్తి పార్వతీకి ఫోన్ చేస్తాడు. అక్షయ్ కి నేను మేనమామ ని అక్షయ్ నీ కొడుకు కాదన్న విషయం నాకు తెలుసు నేను అందరికీ చెప్పను అందుకు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలన్నట్టు డిమాండ్ చేస్తాడు. కానీ పార్వతి ఏం మాట్లాడుకుండా మౌనంగా ఉంటుంది.. ఎవరు నువ్వు ఎందుకు ఫోన్ చేస్తావు? నీకు ఎవరు ఈ విషయం చెప్పారు అక్షయ్ నా కొడుకే అనేసి పార్వతి అతనితో అంటుంది. నీ కొడుకు కాదన్న విషయం నాకు తెలుసు ఈరోజు నా మేనల్లుడు పుట్టినరోజు కదా అందుకే ఫోన్ చేస్తాను. ఫంక్షన్ లో హడావిడిగా ఉంటుంది కదా నువ్వు బిజీగా ఉన్నట్టు ఉన్నావ్ నేను తర్వాత ఫోన్ చేసి మాట్లాడుతానని కట్ చేస్తాడు. పార్వతి టెన్షన్ పడుతూ రాజేంద్రప్రసాద్ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్తుంది.
ఏవండీ ఎవరో నాకు ఫోన్ చేసి అక్షయ్ నీ కొడుకు కాదని అంటున్నాడు ఎవరండీ మీకు నాకు అత్తయ్యకు తప్ప ఈ విషయం ఎవరికీ తెలియదు కదా అక్షయ్ నా కొడుకే ఈ విషయాన్ని నేను ఇన్ని రోజులు దాచి పెట్టానని తెలిస్తే వాడు నన్ను క్షమించండి ఈ విషయాన్ని నేను వారికి ఎలాగైనా చెప్పాలంటూ టెన్షన్ పడుతుంది పార్వతి. నీకు ఫోన్ చేసింది ఎవరో నాకు అర్థం అయిపోయింది పార్వతి వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు టెన్షన్ పడకు అనేసి ధైర్యం చెప్తాడు. ఇక రాజేంద్రప్రసాద్ తన బామ్మర్ది దగ్గరికి వెతుక్కుంటూ వెళ్తాడు. డబ్బులు మోహన విసిరి కొడతాడు. తాగడానికి 500000 ఇట్ల లక్షల అడుగుతున్నావు నీకు సిగ్గు అనిపించట్లేదా అనేసి రాజేంద్రప్రసాద్ తిడతాడు ఇంకొకసారి నా వాళ్లకు గాని నాకు గాని ఫోన్ చేస్తా అంటే బాగోదని హెచ్చరిస్తాడు.
కానీ తన బామ్మర్ది మాత్రం డబ్బులు ఇచ్చావు బాగానే ఉంది చెంప దెబ్బ ఎలా మర్చిపోతాను అనుకున్నావు బావ అని కక్ష పెంచుకుంటాడు. అక్షయ్ నీ కొడుకు కాదన్న నిజాన్ని బయట పెట్టనంతవరకు నువ్వు నాకు డబ్బులు ఇచ్చే బాతువి అక్షయ్ కి ఎలాగైనా ఈ నిజం చెప్పి నీకు టెన్షన్ పెంచాలని ఆలోచిస్తాడు. రాత్రి ఎలాగైనా పార్టీకి వెళ్ళాలి ఈ నిజాన్ని నాలోని దాచుకోకూడదు అన్నట్టు. ఇక పార్వతి ఇంట్లో ఫంక్షన్ హడావిడి చూసుకుంటూ ఉంటుంది. అక్కడికొచ్చి నేను ఏ నగలు వేసుకోవాలమ్మ రెడీ అయితే సరిపోతుంది కదా అనేసి అడుగుతుంది. భానుమతి ఇంట్లో ఫంక్షన్ కాదమ్మా అందరూ వస్తారు నువ్వు నగలు వేసుకో అనేసి అంటుంది. ఇక పక్కనే ఉన్న భానుమతి పెళ్లి కావాల్సిన పిల్లవి నువ్వు నగలు వేసుకొని చాలా అందంగా రెడీ అయితే పదిమంది చూసి నిన్ను మెచ్చుకుంటారు అనేసి మాట్లాడుతుంది. నీకు అప్పుడే కోమలి వచ్చి అమ్మ నేను ఇంట్లో నగలు మర్చిపోయినమ్మ ఏ నగలు తీసుకురాలేదు నేను నగలు అమ్మ నేను వేసుకుంటానంటే సరే అమ్మ వేసుకో అనేసి ఉంటుంది. అవని వదిన దగ్గర లాకర్ తాళాలు ఉన్నాయి కదా పిలిచి నగలు ఇవ్వమని చెప్పమ్మా అనేసి కోమలి అడుగుతుంది.
పార్వతి మాత్రం పల్లవిని పిలుస్తుంది. అవని దగ్గర తాళాలు ఉంటే నువ్వు పల్లవి వదిన ఎందుకు పిలుస్తున్నావమ్మా అనేసి అడుగుతారు. పల్లవి రాగానే అవని దగ్గర తాళాలు తీసుకుని కోమలికి ప్రణతికి నగలు తీసి ఇవ్వు అనేసి అంటుంది. పల్లవి అవనీని పిలిచి తాళాలు అడుగుతుంది. నగలు తీసుకొచ్చి ఇచ్చి కోమలికి ప్రణవికి ఇస్తుంది. ఇక అవనికి మళ్ళీ తిరిగి తాళాలు ఇస్తుంటే పార్వతి ప్రతిసారి తాళాలు అడగాలంటే ఇబ్బందిగా ఉంటుంది దానికి భానుమతి నీకు అర్థమవుతుందా పల్లవి తాళాలు నీ దగ్గరే ఉంచుకోమని మీ అత్తయ్య అంటుంది అనగానే అవని నీ దగ్గరే ఉంచుకొని వెళ్ళిపోతుంది.. ఇక రాజేంద్రప్రసాద్ ఇంటికి రాగానే తన బామ్మర్ది అక్షయ్ గురించి నిజం చెప్తాడని ఆలోచిస్తుంటాడు అంతలోకే అతనికి గుండెపోటు వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ అక్కడికి వస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. ఎపిసోడ్లో అక్షయ్ ఫంక్షన్ను గ్రాండ్ గా చేస్తారు. అక్కడికొచ్చిన రాజేంద్రప్రసాద్ మొదటి భార్య తమ్ముడు అక్షయకు నిజం చెప్పబోతాడు. మరి నిజం చెప్తాడా లేదా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి..