Sitting Risk: ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరంపై అనేక ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా కంప్యూటర్ లేదా డెస్క్ వద్ద ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారు అనేక వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని ఓ అధ్యయనంలో రుజువైంది. అందుకే డాక్టర్లు కూడా ఎక్కువసేపు ఒకే చోట అస్సలు కూర్చో కూడదని చెబుతుంటారు. అంతే కాకుండా పని మధ్యలో విరామం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తారు. మరి ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. నడుము నొప్పి:
ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ ప్రభావితం కావడమే కాకుండా శరీరంలోని వివిధ ఎముకలు, కండరాలు, కీళ్లపై కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా, వీపు, మెడ భాగాలను నిరంతరం ఒకే స్థితిలో ఉంచాల్సి రావడంతో, ఈ భాగాలు తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఈ ఒత్తిడి కండరాలు సాగడానికి, గట్టిగా మారడానికి కారణమవుతుంది. అంతే కాకుండా నొప్పిని కలిగిస్తుంది. కండరాలకు తగినంత విశ్రాంతి లభించనప్పుడు, అవి అలసిపోయి క్రమంగా శరీరంలోని ఇతర భాగాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయి.
2. గుండె జబ్బులు:
ఎక్కువసేపు ఒకే చోట కూర్చోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణలో ఆటంకం ఏర్పడుతుంది. దీని కారణంగా శరీరంలోని వివిధ భాగాలలో రక్తం సరిగ్గా ప్రసరించదు. ఫలితంగా రక్తం గడ్డ కట్టడం జరుగుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది. శరీరంలో రక్తం గడ్డకట్టినప్పుడు, అది రక్త నాళాలను అడ్డుకుంటుంది. అంతే కాకుండా గుండె , మెదడుకు రక్తం సరిగ్గా ప్రవహించకుండా ఆపి వేస్తుంది. ఈ పరిస్థితి గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది.
3. కండరాల బలహీనత:
ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కండరాలు, ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, కాళ్ళ కండరాలు బలహీనపడతాయి. ఇది కండరాల సాధారణ పనితీరును ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా ఫలితంగా శరీరం బలహీనంగా తయారవుతుంది. దీని కారణంగా కండరాల నొప్పి లేదా ఒత్తిడి ప్రమాదం కూడా చాలా వరకు పెరుగుతుంది.
4. ఊబకాయం పెరుగుదల:
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కేలరీలు బర్న్ అయ్యే రేటు తగ్గుతుంది. అంతే కాకుండా ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. దీని వల్ల శరీరంలో, ముఖ్యంగా బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. ఊబకాయం.. మధుమేహం , అధిక రక్తపోటు వంటి అనేక ఇతర వ్యాధులకు కారణమవుతుంది.
Also Read: జుట్టు పలచబడుతోందా ? ఇలా చేస్తే.. ప్రాబ్లమ్ సాల్వ్
5. డయాబెటిస్ :
ఎక్కువసేపు కూర్చోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుంది. ఇది ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేయడంపై ప్రభావం చూపడంతో టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే మీరు పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు 5 నుండి 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఇది మీ శరీరానికి కొంత కదలికను ఇస్తుంది. అంతే కాకుండా ఇది కండరాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విరామాలు తీసుకోవడం ద్వారా, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు. అంతే కాకుండా అనేక రకాల వ్యాధులను కూడా రాకుండా నివారించవచ్చు.