BigTV English

Upcoming Movies : డైనోసార్ దెబ్బకి డేట్లు మారుస్తున్న సినిమాలు..

Upcoming  Movies : డైనోసార్ దెబ్బకి డేట్లు మారుస్తున్న సినిమాలు..

Upcoming Movies : ఈ డిసెంబర్ కి టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్టులు ఎన్నో రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే బాక్స్ ఆఫీస్ డైనోసార్ సలార్ మూవీ డిసెంబర్ 22న విడుదల చేయాలి అని డిసైడ్ అయిన వెంటనే ఒక్కొక్క సినిమా తన రిలీజ్ డేట్ మార్చుకుంటుంది. డిసెంబర్ 22 టార్గెట్ తో మార్కెట్లోకి రావాల్సిన ఎన్నో సినిమాలు తమ రిలీజ్ డేట్ ని నెలల తరబడి పోస్ట్పోన్ చేసేసాయి. నాని హాయ్ నాన్న, నితిన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ మూవీస్ మాత్రం డిసెంబర్ 7 ,8 తారీకుల లో రిలీజ్ కావడానికి ఫిక్స్ అయ్యాయి.


వెంకటేష్ సైంధవ్ మూవీ సంక్రాంతికి షిఫ్ట్ అయింది. అయితే సంక్రాంతికి కూడా పోటీ తక్కువేమీ లేదు. గుంటూరు కారం బరిలో ఉండనే ఉంది.. ఇక దీంతో కొన్ని సినిమాలు తిరిగి కొత్త రిలీజ్ డేట్ ని వెతుక్కుంటున్నాయి. సంక్రాంతి తర్వాత మూవీస్ కి బాగా మార్కెట్ ఉండేది సమ్మర్ లోనే.. అందుకే మీడియం రేంజ్ సినిమాలు మొత్తం మార్చి రిలీజ్ ని ఏమ్ చేసుకొని ఉన్నాయి. డబల్ ఇస్మార్ట్ మూవీ మార్చి కి రాబోతున్న విషయం ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది. లేటెస్ట్ గా విశ్వక్ సేన్ నటిస్తున్న గాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా మార్చి 8న విడుదల కాబోతున్నట్టు అనౌన్స్ చేశారు.

మరోపక్క సంక్రాంతి మార్కెట్ టార్గెట్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్ కూడా.. మార్చి 8 కి విడుదల చేయాలని దిల్ రాజ్ ఆలోచిస్తున్నాడని టాక్. షూటింగ్ జాప్యం కారణంగా నాగార్జున నా సామిరంగా కూడా సంక్రాంతికి బదులు మార్చిలోనే వచ్చేలా ఉంది. అయితే ఇంకా మార్చ్ లో ఎప్పుడు దీని రిలీజ్ ఉంటుంది అన్న విషయం క్లారిటీగా తెలియదు. మరోపక్క డిసెంబర్ లో రావాల్సిన వరుణ్ ఆపరేషన్ వాలెంటైన్ కూడా మార్చి కి షిఫ్ట్ చేసే ఉద్దేశాలు కనిపిస్తున్నాయి. ఇది కాక ఎన్నో చిన్న సినిమాలు.. కొన్ని డబ్బింగ్ సినిమాలు.. మార్చ్ మార్కెట్ పై ఆశ పెట్టుకొని ఉన్నాయి.


మరోపక్క ఏప్రిల్ మొదటి వారం నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. మార్చిలో కూడా పోటీ ఎక్కువ అయితే సంక్రాంతి నుంచి సమ్మర్ వరకు వచ్చిన సినిమాలు ఆ తర్వాత ఎంతవరకు పోస్ట్పోన్ అవుతాయో చూడాలి. సంక్రాంతికి ..సమ్మర్ కి మధ్యలో పెద్దగా ఇబ్బంది లేని టైం చూసి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడం చిన్న తరహా సినిమాలకు మంచిదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×