Upendra : సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో ఉపేంద్ర ఒకరు. కేవలం నటుడుగా మాత్రమే కాకుండా దర్శకుడుగా కూడా ఉపేంద్ర పరిచయం. ఇప్పుడు అందరూ కల్ట్ సినిమా కల్ట్ సినిమా అని అనడం మొదలుపెట్టారు. కానీ అసలైన కల్ట్ సినిమా అంటే ఏంటో తీసి చూపించాడు ఉపేంద్ర. నేడు పాన్ ఇండియా డైరెక్టర్ గా కొనసాగుతున్న ప్రశాంత్ నీల్ కూడా తనకు ఇష్టమైన డైరెక్టర్ ఉపేంద్ర అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ ఉపేంద్ర సినిమాలోని కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. ఆ రోజుల్లో ఇలాంటి థాట్ ప్రాసెస్ ఉపేంద్రకు ఎలా వచ్చింది అని చాలామంది ఆశ్చర్య పడుతూ ఉంటారు. అలానే ఒక సినిమాని ఉపేంద్ర కన్విన్స్ చేసే విధానం కూడా చాలామంది ప్రేక్షకులను ఆకర్షిస్తుంది అని చెప్పాలి.
ఇక కేవలం కన్నడ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా ఉపేంద్ర పరిచయం. ఉపేంద్ర చేసిన ఎన్నో సినిమాలు తెలుగులో డబ్ అవుతూ వచ్చాయి. ఇక ప్రస్తుతం ఉపేంద్ర యుఐ అనే ఒక సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు కూడా ఉన్నాయి డిసెంబర్ 20వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. అంతేకాకుండా పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు ఉపేంద్ర. ఇక రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు ఉపేంద్ర.
Also Read : Zebra Movie: రివ్యూస్ వలన కమర్షియల్ సక్సెస్ ఆగిపోయింది