Gukesh Dommaraju: భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ దొమ్మరాజు ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. చైనా కి చెందిన డింగ్ లిరెన్ ని ఓడించి గుకేశ్ {Gukesh Dommaraju} ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. కేవలం 18 ఏళ్లకే ఈ ఘనత సాధించాడు. ఇతని గెలుపుతో దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. ఈ యువ గ్రాండ్ మాస్టర్ పై యావత్ భారతదేశం ప్రశంసల వర్షం కురిపించింది.
Also Read: Rohit Sharma: నీకు బుర్ర ఉందా..? రోహిత్ శర్మ సీరియస్.. వీడియో వైరల్
58 ఎత్తుల్లో ప్రత్యర్థి డింగ్ లిరెన్ ఆటకు చెక్ పెట్టి.. ప్రైజ్ మనీ కింద సుమారు రూ. 11 కోట్లు పొందనున్నాడు. ఇక అతను {Gukesh Dommaraju} సోమవారం భారతదేశానికి చేరుకున్నాడు. ఇదిలా ఉంటే.. గుకేశ్ గెలిచిన ప్రైజ్ మనీపై పడే టాక్స్ విషయాన్ని ప్రస్తుతం కొందరు లేవనెత్తుతున్నారు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను {Gukesh Dommaraju} గెలుచుకున్న 11 కోట్లలో ఎంత టాక్స్ కట్ అవుతుంది..? చివరగా అతని చేతికి వచ్చేది ఎంత..? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఛాంపియన్షిప్ కోసం మొత్తం ప్రైజ్ మనీ రూ. 20.75 కోట్లు. ఇందులోనుండి ఒక గేమ్ గెలిచిన వారికి రూ. 1.68 కోట్లు ఇస్తారు. గుకేశ్ {Gukesh Dommaraju} 3 గేమ్ లు గెలవడంతో అతడు రూ. 5.04 కోట్లు అందుకున్నాడు. ఇక రెండు గేమ్స్ గెలిచిన డింగ్ లిరిన్ కి రూ. 3.36 కోట్లు దక్కాయి. ఇక మిగిలిన రూ. 12.35 కోట్లు ఇద్దరు ఆటగాళ్లకు సమానంగా పంచుతారు. అలా గుకేశ్ కి రూ. 11 కోట్ల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ అందుతుంది. అయితే ఇందులో 30%.. అనగా రూ. 4.67 కోట్లు పన్నుల రూపంలో చెల్లించాల్సి వస్తుంది. ఇక మిగిలిన రూ. 6.33 కోట్లు గుకేశ్ కి అందుతాయి.
అయితే ఇంత భారీ మొత్తాన్ని పన్నుల రూపంలో వసూలు చేయడంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఆటలో గెలిచింది గుకేశ్ {Gukesh Dommaraju} కాదని, ఆర్థిక శాఖ గెలిచిందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆటగాళ్లపై విధించే టాక్స్ లని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో కూడా భారత క్రికెటర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.
Also Read: IND vs AUS: మళ్లీ అదే తప్పు.. నీకు బ్యాటింగ్ చేతకాదంటూ కోహ్లీపై గవాస్కర్ సీరియస్
అతడిని రూ. 27 కోట్ల రూపాయలకు లక్నో సూపర్ జేంట్స్ దక్కించుకుంది. కానీ టాక్స్ లు పోగా అతడికి దక్కింది కేవలం రూ. 18.9 కోట్లు మాత్రమే. అలాగే మరో ఆటగాడు మహేంద్రసింగ్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ రూ. 4 కోట్లకు రిజర్వ్ చేసుకుంది. అంటే ధోనీ అందుకున్న ఐపిఎల్ వేతనం కంటే గుకేశ్ {Gukesh Dommaraju} చెల్లించిన పన్ను ఎక్కువగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.