Uppal Balu: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామంది పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ఉప్పల్ బాలు ఒకరు. ట్రాన్స్ జెండర్ రూపంతో ఉప్పల్ బాలు చాలా ఫేమస్ అయ్యారు. అయితే అలాంటి ఉప్పల్ బాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పెళ్లి, పిల్లలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు లేడీస్ ని నేను దూరం పెడతాను. దానికి కారణం ఓ సంఘటన అంటూ చెప్పుకొచ్చారు. మరి ఇంతకీ ఉప్పల్ బాలు ఆ ఇంటర్వ్యూ లో ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం..
తన జెండర్ పై తొలిసారి ఓపెన్ అయిన ఉప్పల్ బాలు..
ఉప్పల్ బాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాకు లేడీస్ అంటే అస్సలు నచ్చదు. ఎందుకంటే నాతో పాటు రూమ్ లో ఉండే నా ఫ్రెండ్ ఓ పెళ్లయిన అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆమెది వేరే దేశం.ఆమె గురించి పోలీసులు వెతుకుతున్నారు. కానీ ఈ విషయం తెలియని నేను ఓ రోజు ఆమెతో కలిసి బర్త్డే వీడియో చేశా.అది నా ఐడిలో పోస్ట్ చేశా. ఆ తర్వాత రోజు నేను వేరే వాళ్ళ ఇంట్లో వంట చేయడానికి వెళ్ళిన టైంలో నా వీడియో మొత్తం వైరల్ అయ్యి, ఆ అమ్మాయి భర్తకు కూడా తెలిసింది. పోలీసులకు సమాచారం తెల్సి నేను వంట చేసే వారింటి చుట్టూ 30 మంది పోలీసులు గుమిగూడారు. ఇక వారిని చూసి నేను షాకయ్యా. ఆ తర్వాత పోలీసులు నన్ను పట్టుకొని ఆ అమ్మాయి గురించి అడిగారు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు.మా ఫ్రెండ్ తీసుకొచ్చాడని చెప్పినా వినకుండా నన్ను లాక్కొని వెళ్లారు. ఆ తర్వాత మా వీధిలో వాళ్ళందరూ అయినా వీడు అమ్మాయిని తీసుకొచ్చుకొని ఏం చేస్తాడు.. ఓయో తీసుకెళ్ళినా చేసేదేమీ లేదు.. భజన తప్పా అన్నారు. ఇక వాళ్ళ మాటలకు నేను నవ్వేశాను.
నేను అలంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను.
ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో ఫస్ట్ టైం నేను చేతులు కట్టుకొని నిల్చున్నాను. అప్పటి వరకు నేను పోలీస్ స్టేషన్ మొహం కూడా చూడలేదు. కానీ ఆ అమ్మాయి వల్ల నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాను.ఆ తర్వాత మా ఫ్రెండ్ కి ఫోన్ చేసి రమ్మంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి ఈయన నాకు తెలియదు నేను ఇతని కోసం వచ్చాను.అయినా నా లైఫ్ నా ఇష్టం. నేను ఇతనితోనే ఉంటా అని క్లారిటీగా పోలీసులకు చెప్పేసింది. ఆ తర్వాత పోలీసులు నన్ను వదిలేశారు. ఇక అప్పటినుండి అమ్మాయిల మీద నాకు పూర్తిగా నమ్మకం పోయింది. అందుకే లేడీస్ ఎవరితో కూడా నేను అంత మింగిల్ అవ్వను అంటూ చెప్పుకొచ్చారు. అలాగే అదే ఇంటర్వ్యూలో మీరు పెళ్లి చేసుకుంటారా అని యాంకర్ అడగగా.. నేను పెళ్లి చేసుకుంటాను.. మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నా. మా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ మొత్తం అర్థం చేసుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అంటూ ఉప్పల్ బాలు చెప్పుకొచ్చారు.