BigTV English
Advertisement

MI – Superman : కొత్త జెర్సీలో ముంబై ఇండియన్స్..ఇక పై అందరూ సూపర్ మాన్స్

MI – Superman :  కొత్త జెర్సీలో ముంబై ఇండియన్స్..ఇక పై అందరూ సూపర్ మాన్స్

MI – Superman : ఐపీఎల్ 2025 సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు అన్ని జట్ల కంటే చివరగా ప్లే ఆప్స్ కి క్వాలిఫై అయిన విషయం తెలిసిందే. ఈ జట్టు మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ జరిగిన కీలక మ్యాచ్ లో ఘన విజయం సాధించి ప్లే ఆప్స్ కి అర్హత సాధించింది. ఇక ముంబై ఇండియన్స్ ప్లే ఆప్స్ అర్హత సాధించడంతో కొత్త జెర్సీలో కనిపించనుంది. ఇక నుంచి ఆ జట్టులో అందరూ సూపర్ మాన్స్ లా కనిపించనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read :  Ishan Kishan: అమ్ముడుపోయిన ఇషాన్.. ముంబై కోసం RCBని చీల్చి చెండాడాడు

ఐపీఎల్ లో ప్రస్తుతం ప్లే ఆప్స్ రేసు ముగిసింది. ఇక మిగిలింది టాప్ 2 కోసం పోరు మాత్రమే. ఇప్పటికే ప్లే ఆప్స్ కి చేరిన గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడికి చేరినటువంటి జట్లకు క్వాలిఫయర్ లో ఓడినా.. మరో అవకాశం ఉంటుంది. మరోవైపు టేబుల్ లో అట్టడుగున ఉన్న జట్టు.. టాప్ 2 రేసు పై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. దీంతో ఈ సమీకరణాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పాయింట్ల పట్టికలో టాప్ లో కొనసాగుతున్న గుజరాత్ కి ప్లే ఆప్స్ నుంచి ఎలిమినేట్ అయిన లక్నో గత మ్యాచ్ లో షాక్ ఇచ్చింది. దీంతో ఆ జట్టు టాప్ 2 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. గుజరాత్ మరో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. అందులో గెలిచినా ఆ జట్టు ఖాతాలో చేరేవి 20 పాయింట్లు. అప్పుడు గుజరాత్ టాప్ 2 భవితవ్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ జట్లు తేల్చనున్నాయి. ఒకవేళ అట్టడుగున్న ఉన్న చెన్నై.. చివరి మ్యాచ్ లో గుజరాత్ కి షాక్ ఇస్తే.. శుబ్ మన్ గిల్ సేన మూడో స్థానానికి పడిపోయినా ఆశ్చర్యపోనవరం లేదు.


ఆర్సీబీ భవితవ్యం.. 

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో కొనసాగుతున్న ఆర్సీబీ జట్టు రెండో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. టాప్ 1 లోకి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లక్నో షాక్ ఇస్తే.. మాత్రం ఆర్సీబీ టాప్ 2 అవకాశాలు గల్లంతు అవుతాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే గుజరాత్ జట్టుకి షాక్ ఇచ్చింది. ఇక మరీ ఆర్సీబీకి కూడా షాక్ ఇస్తుందేమోనని పేర్కొంటున్నారు పలువురు క్రికెటర్లు.

దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్

దాదాపు 11 సంవత్సరాల తరువాత శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ప్లే ఆప్స్ కి చేరుకుంది పంజాబ్ జట్టు. 17 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ, ముంబై తో తన తదుపరి మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో విజయం సాధిస్తే.. 21 పాయింట్లతో టాప్ 2లోకి వెల్లే అవకాశం ఉంది.

ముంబై జట్టు పరిస్థితి.. 

ముంబై ఇండియన్స్ జట్టు ఇక ఆడాల్సింది కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే. అది కూడా టాప్ 3లో ఉన్న పంజాబ్ కింగ్స్ తో.. పంజాబ్ ఓడితే పాండ్యా సేన నాలుగో స్థానంలోనే ఉంటుంది. పంజాబ్ పై గెలిచినా ముంబై ఖాతాలో చేరేవి 18 పాయింట్లు మాత్రమే.. టాప్ 2లోకి చేరాలంటే మిగతా మూడు జట్లు రాబోయే అన్ని మ్యాచ్ లు ఓడిపోవాలి. అది జరిగే పని కాదు. దీంతో ముంబై మాత్రం నాలుగో స్థానంలోనే ఉండటం గ్యారెంటీ క్రీడా అభిమానులు పేర్కొంటున్నారు.  ఇక కొత్త జెర్సీతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఎలా రాణిస్తారో వేచి చూడాలి మరీ.

?igsh=Ym95cGlkMXV0bXN0

Related News

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

PV Sindhu: బోల్డ్ అందాలతో రెచ్చిపోయిన PV సింధు.. వెకేషన్ లో భర్తతో రొమాన్స్

IND VS AUS, 4th T20I: టాస్ ఓడిన టీమిండియా..మ్యాక్స్‌వెల్ తో పాటు 4 గురు కొత్త‌ ప్లేయ‌ర్లు వ‌చ్చేస్తున్నారు

Harleen Deol: మోడీ సార్‌.. ఎందుకు ఇంత హ్యాండ్స‌మ్ గా ఉంటారు? హర్లీన్ డియోల్ ఫ‌న్నీ క్వ‌శ్చ‌న్‌

Pratika Rawal : ప్రతికా రావల్ ను అవమానించిన ఐసీసీ.. కానీ అమన్ జోత్ చేసిన పనికి ఫిదా అవ్వాల్సిందే

Nigar Sultana: డ్రెస్సింగ్ రూంలో జూనియర్లపై దాడి… బంగ్లా ఉమెన్ టీమ్ కెప్టెన్‌పై ఆరోపణలు

Big Stories

×