YSRCP vs TDP : ఐదేళ్ల పగ. తీవ్ర ఆధిపత్య పోరు. రాజకీయ ప్రతీకారాలు. ఘోరమైన అవమానాలు. ఏళ్ల తరబడి కాపాడుకున్న చిలకలూరిపేట తనది కాదన్నారు. ఎక్కడినుంచో ఊడిపడిన విడదల రజినీని అక్కున చేర్చుకున్నారు. రాజకీయ ‘మర్రి’ వృక్షం కుప్పకూలిపోయింది. జగన్ దుర్నీతి.. రజినీ రాజకీయం ముందు నిలవలేకపోయారు. ఇక తనవల్ల కాదంటూ.. వైసీపీలో తానుండలేనంటూ.. ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు మర్రి రాజశేఖర్.
వైసీపీలో తనను చులకనగా చూశారని.. తన రాజీనామాకు జగనే కారణమంటూ మర్రి పొలిటికల్ బాంబులు పేల్చారు. విడదల రజినీని ప్రమోట్ చేసేందుకు పార్టీలో తనను తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఇవ్వలేదని.. చివరాఖరులో ఎమ్మెల్సీని చేశారని చెప్పుకొచ్చారు. కౌంటర్‌గా రజినీ సైతం ప్రెస్‌మీట్ పెట్టి మర్రి ఆరోపణలను ఖండించారు. జగన్ చెబితేనే తాను ఏదైనా చేశానని.. రాజశేఖర్‌కు పార్టీలో సరైన ప్రాధాన్యమే ఇచ్చారన మేటర్ కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి పొలిటికట్ స్టేట్మెంట్స్ కామనే అయినా.. మర్రి రాజశేఖర్ మేటర్ మాత్రం కామన్ కానేకాదని.. రాజకీయాల్లో మర్రికి జరిగినంత అన్యాయం మరే లీడర్‌కూ జరిగలేదనేది ఆయన అభిమానుల మాట.
Also Read : సత్తిబాబుకో లెక్కుంది!.. జనసేనలోకి దారుంది!!
మర్రి రాజశేఖర్. చిలకలూరుపేట వైసీపీ స్ట్రాంగ్ లీడర్. జగన్‌కు బలమైన సపోర్టర్. 2019లో దాదాపు ఆయనకు ఎమ్మెల్యే టికెట్. ఇలాంటి టైమ్‌లో విడదల రజినీ వైసీపీలో ఎంట్రీ ఇవ్వడంతో మర్రికి బ్యాడ్‌టైమ్ స్టార్ట్ అయింది. హైటెక్ సిటీలో చంద్రబాబు నాటిన మొక్కను తానంటూ టీడీపీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రజినీ.. సడెన్‌గా జగన్ చెంతకు చేరడంతో ఆమెను నెత్తిన పెట్టుకున్నారు వైసీపీ అధినేత. చిలుకలూరిపేటలో మర్రిని కాదని విడదలను ప్రమోట్ చేశారు. విపరీతంగా డబ్బులు వెదజల్లి.. సోషల్ మీడియాలో ఫుల్ ప్రమోషన్ చేయించుకుని.. చాకచక్యంగా ఎమ్మెల్యే టికెట్ ఎగరేసుకుపోయారు. మర్రి రాజశేఖర్ హర్ట్ అయ్యారు. మర్రికి మంత్రి పదవి ఇస్తానంటూ బహిరంగంగా ప్రకటించి ఆయన్ను బుజ్జగించారు జగన్.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజశేఖర్‌కు మంత్రి పదవి రాలేదు. కట్ చేస్తే.. కొంతకాలానికే విడదల రజినీని మంత్రిని చేశారు. అవమాన భారం వేధిస్తున్నా.. మర్రి జగన్‌కు విధేయుడుగానే ఉన్నారు. 2023లో ఎమ్మెల్సీని మాత్రం చేశారు. 2024 ఎన్నికల్లో రజినీని గుంటూరు వెస్ట్‌కు పంపితే చిలకలూరిపేట టికెట్ తనకేనని ఆశపడ్డారు. కానీ, ఈసారి కూడా టికెట్ ఇవ్వకుండా మొండిచేయి చూపించారు జగన్. పవర్ పోవడంతో ఇక ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. రజినీని మళ్లీ చిలకలూరిపేటకు రప్పించారు. ఇక పార్టీలో ఉండి వేస్ట్ అనుకుని.. ఎమ్మెల్సీకి, వైసీపీకి రిజైన్ చేసి పడేశారు మర్రి రాజశేఖర్. మరో మూడేళ్ల పదవీకాలం ఉన్నా రాజీనామా చేశారంటే ఆయన ఆ పార్టీపై ఎంత అసంతృప్తి, ఆగ్రహంగా ఉన్నారో తెలుస్తోంది. ఇలా వైసీపీలో మర్రి ప్రస్థానం ముగిసింది. టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నారు. కానీ, టీడీపీ చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుతో మర్రి రాజశేఖర్‌కి అసలే మాత్రం పడదు. తెలుగుదేశంలో ఎలా కలిసిపోతారో! విడదల రజినీపై రివేంజ్ తీర్చుకోవడమే ప్రస్తుతం మర్రి టార్గెట్‌గా కనిపిస్తోంది. చిలకలూరిపేటలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి..