Bhringraj Oil: జుట్టు రాలడం, బలహీనమైన, పొడిబారిన జుట్టు నేటి కాలంలో అన్ని వయస్సుల వారికి ఒక సాధారణ సమస్యగా మారాయి. ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, హెయిర్ స్టైలింగ్ , రసాయనాలతో తయారు చేసిన ఆయిల్స్, షాంపూల వాడకం జుట్టు సమస్యలను పెంచుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి మార్కెట్లో చాలా ఖరీదైన ప్రొడక్ట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అవి సమస్య నుండి తాత్కాలికంగా ఉపశమనాన్ని అందిస్తాయి. కానీ వీటిని ఎక్కువగా వాడటం వల్ల జుట్టుకు కూడా హాని కలిగుతుంది.
ఇలాంటివి జరగకుండా ఉండటానికి మనం హోం రెమెడీస్‌తో పాటు ఆయుర్వేద ఆయిల్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపాలి. ఎందుకంటే వీటిని ఉపయోగించడం వల్ల ఎటువంటి హాని ఉండదు. ఉసిరి, భ్రింగ్‌రాజ్ ( గుంటగలగర ఆకు ), కుంకుడు కాయ , శికాకై వంటి మూలికలు జుట్టుకు మేలు చేస్తాయి. అంతే కాకుండా ఇవి జుట్టును బలోపేతం చేయడంతో పాటు, జుట్టును మందంగా , మృదువుగా మరుస్తాయి. ఈ మూలికలన్నింటిలో, భ్రింగ్‌రాజ్ జుట్టుకు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. మరి జుట్టుకు భృంగరాజ్‌ను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టుకు భృంగరాజ్ ఎలా ఉపయోగించాలి ?
జుట్టును బలోపేతం చేయడానికి భ్రింగ్‌రాజ్ ( గుంట గలగర ఆకు) నీటితో జుట్టును వాష్ చేయడం చాలా మంచిది. భ్రింగ్‌రాజ్ నీటితో జుట్టును వాష్ చేయడం వల్ల జుట్టు రాలడం సమస్య తొలగిపోతుంది. అంతే కాకుండా ఇది కొత్త జుట్టు పెరగడంలో కూడా సహాయపడుతుంది. దీని కోసం, మీరు ఒక లీటరు నీటిని తీసుకొని, అందులో 5 చెంచాల భ్రింగ్‌రాజ్ పొడిని కలిపి మరిగించాలి. అది చల్లబడిన తర్వాత, ఈ నీటితో మీ జుట్టును వాష్ చేసుకోవాలి.
భ్రింగ్‌రాజ్ హెయిర్ మాస్క్:
మీ జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, మీరు భ్రింగ్‌రాజ్ హెయిర్ మాస్క్‌ను కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మాస్క్ మీ జుట్టుకు సహజ తేమను అందించడమే కాకుండా బలపరుస్తుంది. దీనివల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అంతే కాకుండా కొత్త జుట్టు రావడానికి కూడా సహాయపడుతుంది. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడానికి, మీరు పెరుగు, తేనె, భ్రింగ్‌రాజ్ పొడిని ఉపయోగించాలి. వీటన్నింటినీ కలిపి పేస్ట్ తయారు చేసి జుట్టు మూలాల నుండి చివరల వరకు బాగా అప్లై చేయండి. ఈ మాస్క్ ని 30 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోండి.
భృంగరాజ్ ఆయిల్ మసాజ్:
మీ జుట్టును భ్రింగ్‌రాజ్ నూనెతో మసాజ్ చేయడం వల్ల కూడా మీరు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఈ ఆయిల్ మసాజ్ వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అంతే కాకుండా జుట్టు పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది. మరోవైపు, భ్రింగ్‌రాజ్ నూనెను ఉపయోగించడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది. అంతే కాకుండా జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు దీనిని వాడటం వల్ల అద్భుత లాభాలు ఉంటాయి.
Also Read: చెరకు రసం తాగితే.. శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే !
భ్రింగ్‌రాజ్, కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె జుట్టుకు పోషణను అందించడంలో, జుట్టును మృదువుగా చేయడంలో కూడా చాలా ప్రయోజనకరంగా పని చేస్తుంది. భ్రింగ్ రాజ్ , కొబ్బరి నూనె ఈ రెండింటినీ కలిపి జుట్టుకు వాడితే దాని ప్రభావం రెట్టింపు అవుతుంది. అందుకే మీరు భ్రింగ్‌రాజ్ , కొబ్బరి నూనెను కలిపి మీ తలకు బాగా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు మృదువుగా, బలంగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలే సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది.