BigTV English

Comedian Sathya: ఓటీటీని శాసించడానికి సిద్ధమైన సత్య.. బెట్టింగ్ భోగి పాత్రలో..!

Comedian Sathya: ఓటీటీని శాసించడానికి సిద్ధమైన సత్య.. బెట్టింగ్ భోగి పాత్రలో..!

Comedian Sathya:కమెడియన్ సత్య (Comedian Sathya).. తన అద్భుతమైన కామెడీతో హీరో రేంజ్ లో పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. తన కామెడీతో వెండితెరను శాసించే స్థాయికి చేరుకున్నారు. అలా వెండితెర నవ్వుల రారాజుగా పేరు సొంతం చేసుకున్న సత్య.. ఇప్పుడు ఓటీటీని కూడా శాసించడానికి సిద్ధం అయ్యారు. తాజాగా ‘3 రోజెస్ సీజన్ 2’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సత్యా.. ‘బెట్టింగ్ భోగి’గా ఆడియన్స్ ను అలరించబోతున్నారు.తాజాగా 3 రోజెస్ సీజన్ 2 నుండి టీజర్ విడుదల చేయగా.. ఆద్యంతం ఆకట్టుకోవడమే కాకుండా సమాజానికి ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఈషా రెబ్బా, హర్ష, సత్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న వెబ్ సిరీస్ 3 రోజెస్ సీజన్ 2. తాజాగా ఇందులో సత్యా పాత్రను పరిచయం చేస్తూ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ సీజన్ 2 లో ఆయన బెట్టింగ్ భోగి పాత్రలో కనిపించనున్నారు. ఆహా వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది .కిరణ్ కారవల్ల ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు.


ఆకట్టుకుంటున్న 3 రోజెస్ సీజన్ 2 టీజర్..

3 రోజెస్ సీజన్ 2 నుండీ సత్య పాత్రను రివీల్ చేస్తూ బెట్టింగ్ భోగి గా నటిస్తున్నట్లు టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ప్రారంభం అవ్వగానే.. “బెట్టింగ్ ఆడడం చట్టరీత్యా నేరం మీతో పాటు మీ కుటుంబానికి కూడా ప్రమాదకరం.. జాగ్రత్తగా ఉండండి. రన్ అవుట్ కాకండి..”అంటూ సత్యా వాయిస్ తో ఒక డిస్క్లైమర్ విడుదల చేస్తారు. కట్ చేస్తే సీన్ స్టార్ట్ అవ్వగానే సత్య.. పక్కన ఒక అమ్మాయి తో మొబైల్ లో క్రికెట్ చూస్తూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. పక్కనే ఉన్న అమ్మాయి నువ్వు బెట్టింగ్ ఆడతావా అంటే.. డబ్బులు వచ్చే పని తప్ప నేనేం చేయను నువ్వు వరీ అవ్వకు అంటూ చెబుతాడు. ఆ తర్వాత ఐపీఎల్ క్రికెట్ స్టార్ట్ అవ్వగానే ఒక్కొక్క జట్టుపై బెట్టింగ్ చేయడం మొదలు పెడతాడు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే .. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ అన్వేష్ ను హైలెట్గా చూపించారు. ఇక తాను పెట్టిన బెట్టింగ్ లో విన్ అవుతూ తన రైజింగ్ హ్యాండ్ గురించి అందరితో చెబుతూ ఉంటాడు. అయితే సడన్ గా దరిద్రం వెంటాడుతుంది. ఆయన బెట్టింగ్ పెట్టిన ప్రతిదీ కూడా ఓడిపోతాడు. అలా రూ.10లక్షలు కోల్పోతాడు. ఆఖరికి గర్ల్ ఫ్రెండ్ చేతిలో కూడా తిట్లు తింటాడు. ఇక నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నా అని సీరియస్ మోడ్ చూపించి, వెంటనే మనకు బెట్టింగ్ తప్ప ఇంకోటి రాదు అంటూ మళ్ళీ సత్య తన కామెడీ స్టైల్ లో నవ్వించాడు. మొత్తానికైతే ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ఆడియన్స్ ముందుకు రానున్నట్లు సమాచారం.


ALSO READ:Actor Sumanth : ఆ విషయంలో మహేష్ బాబును డిస్ట్రబ్ చెయ్యను.. సుమంత్ షాకింగ్ కామెంట్స్..!

కమెడియన్ సత్య కెరియర్..

కమెడియన్ సత్య అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడిగా పేరు సొంతం చేసుకున్నారు మొదట ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో లో ధనరాజ్ టీమ్ లో కామెడీ చేసి ఆకట్టుకున్నారఆ తర్వాత సుధీర్ వర్మ సినిమా స్వామి రారా లో కీలక పాత్ర పోషించి, భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. అలా వెంకటాద్రి ఎక్స్ప్రెస్, స్పీడున్నోడు, జై లవకుశ, రౌడీ ఫెలో, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాలు చేసిన సత్యా ‘వివాహ భోజనంబు ‘సినిమాతో హీరోగా కూడా పరిచయమయ్యారు.

Related News

Mothevari Love story: స్ట్రీమింగ్ కి సిద్ధమైన మోతెవరి లవ్ స్టోరీ.. తెలంగాణ గ్రామీణ ప్రేమకథగా!

OTT Movie : ఆ 19వ ఫ్లోర్ నరకం… యాక్సిడెంట్ తో వర్చువల్ రియాలిటీ గేమ్ ఉచ్చులో… ఓడితే కోమాలోకి

OTT Movie : అయ్య బాబోయ్ టీచర్ కు అబ్బాయిల మోజు… పోలీస్ తోనే వైరల్ వయ్యారి రాసలీలలు

OTT Movie : అందమైన అమ్మాయిపై కన్నేసే మాఫియా డాన్… 365 రోజులు బందీగా ఉంచి అదే పని… అన్నీ అవే సీన్లు

OTT Movie : భార్య ప్రైవేట్ ఫొటోలు బయటకు…. భర్త ఉండగానే దారుణం… బ్లాక్‌మెయిలర్

OTT Movie : స్కామర్ తో మిలియనీర్ సయ్యాట… ఒక్క నైట్ కలిశాక థ్రిల్లింగ్ ట్విస్ట్

Big Stories

×