Varun Tej on Sai Durga Tej : మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. శ్రీకాంత్ డైలాగ్ దర్శకత్వం వహించిన ముకుంద సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు వరుణ్. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇండస్ట్రీకి మంచి హీరో దొరికాడు అని అనిపించుకున్నాడు. ఆ తర్వాత అందరు హీరోలలా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన పంథాను ఎన్నుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్ళాడు. అయితే వరుణ్ తేజ్ కెరియర్లో హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. ఫిదా,తొలిప్రేమ,గద్దల కొండ గణేష్ వంటి సినిమాలు వరుణ్ తేజ్ కు మంచి పేరును తీసుకొచ్చాయి. రీసెంట్ టైమ్స్ లో వరుణ్ తేజ్ నటించిన సినిమాలో బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోతున్నాయి. వరుణ్ తేజ్ మార్కెట్ బాగా పడిపోయింది.
ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు. వరుణ్ లేటెస్ట్ ఫిలిం మట్కా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇకపోతే మరోవైపు సాయి ధరంతేజ్ 18వ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమాకి సంబరాల ఏటిగట్టు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ లాంచ్ చేశారు. ఇక సాయి తేజ్ కెరియర్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకి రోహిత్ కేపీ అనే దర్శకుడు దర్శకత్వం వహిస్తున్నాడు. సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. విరూపాక్ష వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో చాలామందికి క్యూరియాసిటీ మొదలైంది.
Also Read : Akhanda 2: బాలకృష్ణతో ఛాన్స్ కొట్టేసిన సీనియర్ నటి లయ కూతురు.. ఈసారైనా హిట్ కొడుతుందా?
మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. దానికి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన సంధ్య థియేటర్ ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈరోజు పొద్దున్నే చంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చాడు. ఈ తరణంలో చాలామంది సినిమా ప్రముఖులు యంగ్ హీరోస్ అంతా అల్లు అర్జున్ నివాసానికి పరామర్శికి వెళ్తున్నారు. ఇదే టైంలో వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా సాయి తేజ్ నటించిన సంబరాల ఏటిగట్టు గ్లిమ్ప్స్ షేర్ చేశాడు. షేర్ చేస్తే తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. దీనికి సాయి తేజ్ కూడా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు మెగా హీరోస్ పైన ఏమి టైమింగ్ రా బాబు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
Looking fire @IamSaiDharamTej
🔥🔥🔥
The carnage of #SambaralaYetiGattu is pure fire and can’t wait to see it on the big screen soon. I know this one’s going to be something special 🤗 https://t.co/nM6qS1uGli— Varun Tej Konidela (@IAmVarunTej) December 14, 2024