Venkat Prabhu : తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ దర్శకులలో వెంకట్ ప్రభు ఒకరు. కేవలం ప్లే బ్యాక్ సింగర్ గా, నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా తనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సాధించుకొని, మంచి గుర్తింపును పొందుకున్నాడు. వెంకట ప్రభు 2007లో రిలీజ్ అయిన “చెన్నై 60028” అనే సినిమాతో దర్శకుడుగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత చేసిన సరోజ, గోవా, మంకంద, బిర్యాని, మానాడు వంటి చిత్రాలతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నాడు వెంకట్ ప్రభు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు నటించిన మానాడు సినిమా మంచి హిట్ అయింది. ఈ సినిమా థియేటర్లో రిలీజ్ కాకుండా డైరెక్ట్ గా సోనీ లివ్ అనే ఓటిటి ఛానల్ లో వచ్చింది. అయితే భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాను అన్ని భాషలకు సంబంధించిన ప్రేక్షకులు చూసి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు భారీ ఎలివేషన్లు ఇచ్చి పోస్టులు కూడా పెట్టారు.
ఇక తెలుగులో ఉన్న దర్శకులలో అనుదీప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చేసినవి మూడు సినిమాలు అయినా కూడా జాతి రత్నాలు సినిమాతో విపరీతమైన పేరును సంపాదించుకున్నాడు. ఇక అనుదీప్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్లకి కూడా అనుదీప్ ఫేవరెట్ డైరెక్టర్స్ లో వెంకట ప్రభు ఒకరు అని తెలుస్తుంది. వెంకట్ ప్రభు తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా నాగచైతన్య హీరోగా కస్టడీ అనే ఒక సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఇక రీసెంట్ గా తలపతి విజయ్ నటించిన గోట్ సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా కొంతమేరకు మాత్రమే అంచనాలను అందుకుంది. ఇక మొత్తానికి వెంకట్ ప్రభు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
Also Read : Nag Ashwin Mahanati : కథలు మనల్ని ఎంచుకుంటాయి
వెంకట్ ప్రభు ఎంట్రీ ఇవ్వబోతున్న బాలీవుడ్ సినిమాలో అక్షయ్ కుమార్ హీరోగా చేయనున్నట్లు తెలుస్తుంది. ఆకాశమే హద్దురా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న సుదా కొంగర అదే సినిమాను అక్షయ్ కుమార్ హీరోగా బాలీవుడ్ లో రీమేక్ చేశారు. ఇప్పుడు మళ్లీ అక్షయ్ కుమార్ మరో తమిళ దర్శకుడు చేతులు కలుపుతున్నాడు అని చెప్పాలి. ఇక డైరెక్టర్ వెంకట్ ప్రభు విషయానికి వస్తే శివ కార్తికేయన్ హీరోగా ఒక సినిమాను చేయనున్నాడు.శివ కార్తికేయన్ రీసెంట్ గానే అమరన్ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత తమిళ్ సూపర్ స్టార్ అజిత్ హీరోగా కూడా వెంకట్ ప్రభు ఒక సినిమాను చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత అక్షయ్ కుమార్ తో వెంకట్ ప్రభు సినిమా చేసే అవకాశం ఉంది అని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
Also Read : Allu Arjun: క్యూ కడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్స్.. ఏకంగా బ్లాంక్ చెక్ లతో..