BigTV English

Venkatesh : ఫలితంపై ముందే కామెంట్స్ వద్దు.. వెయిట్ చేద్దాం అంటూ వెంకీ మామ పోస్ట్..!

Venkatesh : ఫలితంపై ముందే కామెంట్స్ వద్దు.. వెయిట్ చేద్దాం అంటూ వెంకీ మామ పోస్ట్..!

Venkatesh.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా, విక్టరీగా పేరు సంపాదించుకున్నారు వెంకటేష్ (Venkatesh ) ముఖ్యంగా తన సినిమాలతో మంచి సందేశం ఇవ్వడమే కాకుండా, కామెడీ కూడా పంచుతూ .. ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి రేసులో నిలిచిన ఈ సినిమా జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేపట్టిన చిత్ర బృందం, అందులో భాగంగానే పలు టీవీ షోలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.


ఇన్స్టా స్టోరీ షేర్ చేసిన వెంకటేష్..

ఇక సెలబ్రిటీలు కూడా తమ వంతు ప్రచారంలో భాగంగా సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ వేదికగా పోస్ట్లు పెడుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విడుదలకి ముందు వెంకటేష్ ఒక పోస్ట్ పెట్టి అందరిని ఆశ్చర్యపరిచారు తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో ఇలా రాసుకొచ్చారు వెంకటేష్.. “రిజల్ట్ ను వెంటనే చూడలేము. కొన్నింటికి సమయం పడుతుంది.ఓపికతో ఉండాలి.” అన్నట్టు తన ఇన్స్టా స్టోరీలో పెట్టాడు వెంకటేష్. ఇక దీన్ని బట్టి చూస్తే సినిమా విడుదలకు ముందే హిట్ అవుతుంది.. ఫ్లాప్ అవుతుంది అనే విషయాలను మాట్లాడకుండా ఉండాలని, సినిమా విడుదలైన తర్వాత ప్రజలే దాని రిజల్ట్ ను తెలియజేస్తారు అన్నట్టుగా వెంకటేష్ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన ఏ ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ పెట్టారో తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.


వెంకటేష్ కెరియర్..

మూవీ మొఘల్ గా గుర్తింపు తెచ్చుకున్న.. టాలీవుడ్ దివంగత బడా నిర్మాత డి.రామానాయుడు (D.Ramanaidu ) రెండవ కుమారుడే వెంకటేష్. ‘కలియుగ పాండవులు’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. చంటి, సుందరకాండ, కలిసుందాం రా, బొబ్బిలి రాజా, ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, రాజా, పవిత్ర బంధం, లక్ష్మీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే ఇలా పలు చిత్రాల ద్వారా ఫ్యామిలీ హీరోగా మంచి పేరు దక్కించుకున్నారు. అంతేకాదు వెంకటేష్ రెండు హిందీ సినిమాలు కూడా చేశారు. ఇప్పటివరకు 75 చిత్రాలు పూర్తి చేసిన ఈయన తన 76వ చిత్రంగా ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల కాబోతోంది.

వెంకటేష్ సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్స్..

ఇకపోతే తన సినిమాల ద్వారా 7 నంది అవార్డులు అందుకున్న వెంకటేష్, తన సినిమాల ద్వారానే దాదాపు చాలామంది హీరోయిన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అలాంటి వారిలో ముందుగా ఫరా, టబు, దివ్యభారతి, ప్రేమ, ఆర్తి అగర్వాల్, ప్రీతిజింతా,గౌతమి, కత్రినా కైఫ్, అంజనా జవేరి తదితర హీరోయిన్లు తెలుగులో వెంకటేష్ సినిమాల ద్వారానే పరిచయమయ్యారు. ఇలా మొత్తానికి అయితే భారీ పాపులారిటీ అందుకున్న ఈయన సౌందర్యా తో 7 సినిమాలు, మీనా తో 4 సినిమాలు, ఆర్తి అగర్వాల్తో 3 సినిమాలు చేసి హిట్ పేరుగా గుర్తింపు సొంతం చేసుకున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమా విశేషాలు..

ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వస్తున్న సినిమా ఇది. సితార ఎంటర్టైన్మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్, పాటలు అన్నీ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచడమే కాకుండా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అంటూ కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×