BigTV English

Saudi Arabia Deport Pakistanis: 9 మంది బిచ్చగాళ్లు సహా 232 పాకిస్తానీలను డిపోర్ట్ చేసిన సౌదీ అరేబియా.. కరాచీలో అరెస్ట్

Saudi Arabia Deport Pakistanis: 9 మంది బిచ్చగాళ్లు సహా 232 పాకిస్తానీలను డిపోర్ట్ చేసిన సౌదీ అరేబియా.. కరాచీలో అరెస్ట్

Saudi Arabia Deport Pakistanis| పాకిస్తాన్ జాతీయా మీడియా కథనాల ప్రకారం.. సౌదీ అరెబియా ప్రభుత్వం ఇటీవలే 232 పాకిస్తానీ పౌరులను తిరిగి వారి స్వదేశానికి పంపించేంది. వీరిలో 9 మంది బిచ్చగాళ్లు కూడా ఉన్నారు. మీడియా రిపోర్ట్ ప్రకారం.. సౌదీ అరేబియా, చైనా, యుఎఇ లాంటి మొత్తం 7 దేశాలు 258 పాకిస్తానీలను గత వారం డిపోర్ట్ చేశాయి. వీరిలో ఒక్క సౌదీ అరేబియా దేశం నుంచి 232 మంది వెనక్కి పంపబడ్డారు. యుఎఇ దేశం నుంచి 21 మంది డిపోర్ట్ అయ్యారు.


అయితే డిపోర్ట్ చేయబడ్డ వారిలో 16 మందిని కరాచీ ఎయిర్ పోర్ట్ లో పాకిస్తాన్ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా వలస చట్టాలను అతిక్రమించి విదేశాలకు వెళ్లారని అరోపణలున్నాయి. విదేశాల నుంచి డిపోర్ట్ చేయబడిన పాకిస్తానీ పౌరుల్లో కేవలం 14 మంది వద్ద మాత్రమే సరైన పాస్ పోర్టులున్నాయని.. మిగతావారందరినీ ఆ దేశాలు ఎమర్జెన్సీ ట్రామెల్ డాక్యుమెంట్స్ ఉపయోగించి డిపోర్టు చేశారని తెలుస్తోంది.

అరెస్టు చేయబడ్డ వారిలో 16 మంది సౌదీ అరేబియాలో తమ వీసా గడువు ముగిసినా అక్కడే దాగి నివసిస్తూ ఉండడంతో వారిని సౌదీ అధికారులు అరెస్ట్ చేసి డిపోర్ట్ చేశారు. మరో 27 మంది పాకిస్తానీలు ఏ స్పన్సర్ లేకుండానే అక్కడ ఉద్యోగాలు చేస్తూ పట్టుబడ్డారు. మరో 112 మందిపై వివిధ నేరారోపణలున్నాయి.


Also Read: ప్రిన్సెస్ డయానాకు సైట్ కొట్టిన ట్రంప్.. ఛీకొట్టిన యువరాణి.. ఆ లవ్ స్టోరీ తెలుసా?

యుఎఈ దేశం నుంచి డిపోర్ట్ చేయబడ్డ నలుగురు పాకిస్తానీలు డ్రగ్స్ అక్రమ రవాణా కేసుల్లో పట్టుబడ్డారు. ఇంకా చైనా, ఇండోనేషియా, సైప్రస్, నైజీరియా, కతార్ దేశాలు ఒక్కో పాకిస్తానీ పౌరుడిని డిపోర్ట్ చేశాయి.

కరాచీలోని జిన్నా ఇంటర్నేష్నల్ ఎయిర్ పోర్ట్ ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ.. “విదేశాల నుంచి డిపోర్ట్ చేయబడిన వారిలో 14 మంది వద్ద మాత్రమే పాకిస్తానీ పాస్‌పోర్ట్స్ ఉన్నాయి. మిగతా వారిలో 244 మంది వద్ద మాత్రం ఎమర్జెన్సీ ట్రావెల్ డాకుమెంట్స్ ఉన్నాయి. సౌదీ అరేబియా దేశం నుంచి డిపోర్ట్ చేయబడిన వారిలో 16 మందిని అనుమానంతో అరెస్ట్ చేశాం. వారిలో ఒక్కరినీ మాత్రమే విడుదల చేశాం. మరో 9 మంది సౌదీ అరేబియాలో బిచ్చంగాళ్లుగా ఉండగా వారినీ డిపోర్ట్ చేశారు” అని వెల్లడించారు.

మరోవైపు గురువారం కరాచీ ఎయిర్ పోర్ట్ లో 35 మంది ప్రయాణీకులను విమానం ఎక్కబోతుండగా అధికారులు అడ్డుకున్నారు. వీరందరి వద్ద సరైన ప్రయాణ పత్రాలు లేవని సమాచారం. విమానం నుంచి దింపబడ్డ 35 మందిలో 18 మంది సౌదీ అరేబియా దేశానికి ఉమ్రా తీర్థయాత్ర కోసం వెళ్తున్నట్లు తెలిసింది. కానీ వారు నిబంధనల ప్రకారం.. అవసరమైన హోటల్ బుకింగ్స్ పత్రాలు సమర్పించలేదని అధికారులు తెలిపారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×