Sankranthiki Vasthunam: ఈ సంక్రాంతికి సినిమాల సందడితో సరికొత్త పండుగ వాతావరణం మొదలైంది. సంక్రాంతికి వెంకీ మామా ర్యాంపేజ్ ఓ మొదలైంది. నేడు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అప్పుడే బాక్సాఫీస్ కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది. వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ మూవీ విడుదలైన కొన్ని గంటల్లోనే దుమ్ము దులిపేస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటుగా అమెరికాలో కూడా కలెక్షన్ల ఊచకోత మొదలు పెట్టింది. మరి ఎన్ని కోట్లు రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం..
తాజాగా ఈ సినిమా కొన్ని గంటల్లోనే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్ల ను కొల్లగొడుతుంది.. నేడు మూవీ విడుదలైన కొద్ది గంటల్లోనే వసూల్లను షేక్ చేస్తుంది. ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 350K డాల్లర్స్ వసూళ్లను సాధించింది. విషయాన్నీ మేకర్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల నుండి భారీ కలెక్షన్స్ కురిసే అవకాశముంది. మరికొందరు ఈ సినిమాని సంక్రాంతి విన్నర్ గా ఫిక్స్ చేశారు. ప్రతి ఏడాది సంక్రాంతికి పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అవుతాయి. అందులో చివరగా వచ్చిన సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్ల గొడుతుంది. అలాగే ఈ ఏడాది కూడా సూపర్ గా వచ్చిన వెంకీ మూవీ సునామీ సృష్టిస్తుందని వెంకీ ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ మూవీ నుంచి వచ్చిన మొదటి షో తోనే ఇప్పటికే ట్విట్టర్ యువత ఈ సినిమాకి మంచి మార్క్స్ వేస్తూ.. “ఈ సినిమా కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అన్ని చోట్ల నుండి టాక్. బుల్లి రాజు పాత్రలో వెంకీ ఆకట్టుకున్నాడు అంటున్నారు. ప్రత్యేకంగా మ్యూజిక్ సినిమాని ఎలివేట్ చేసిందని టాక్. ఇక క్రాఫ్ట్ పరంగా చూసుకుంటే సినిమా డీసెంట్ గానే ఉందని చెబుతున్నారు.. ఒకవైపు అనిల్ రావిపూడి రొటీన్ స్టోరీతో సినిమా వచ్చిందని వెంకీ ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు కొత్తగా చూపించారని అంటున్నారు. ఏది ఏమైనా సినిమా మాత్రం అదిరిపోయిందని అంటున్నారు. మొత్తానికి వెంకీ మామా హిట్ ట్రాక్ మళ్ళీ మొదలు పెట్టేసాడు. ఇక ఆగేదేలే అని ఫ్యాన్స్ అంటున్నారు. ‘ఎఫ్ 2’ తరహాలో తన టిపికల్ మార్క్ కామెడీతో అనిల్ రావిపూడి సినిమా తీశారట. చాలా వరకు కామెడీ వర్కౌట్ అయిందని మెజారిటీ జనాలు చెబుతున్నారు. కథ పెద్దగా లేదని ఈ సినిమాకు కామెడీ హైలైట్ అని లాజిక్స్ వంటివి పట్టించుకుంటే అసలు ఎంటర్టైన్ కాలేరని టాక్. ‘హాయ్’కు ఈ సినిమాలో కొత్త మీనింగ్ ఇచ్చారట.. ఇక కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..