BigTV English
Advertisement

Venky Atluri : సూర్య తో ప్రాజెక్ట్ సెట్, వెంకీ అట్లూరి టైం మామూలుగా లేదు

Venky Atluri : సూర్య తో ప్రాజెక్ట్ సెట్, వెంకీ అట్లూరి టైం మామూలుగా లేదు

Venky Atluri : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లో వెంకీ అట్లూరి ఒకరు. వరుణ్ తేజ్ నటించిన తొలిప్రేమ సినిమాతో తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంటర్ ఇచ్చాడు వెంకీ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. తొలిప్రేమ అనే టైటిల్ కి ఎంత ప్రత్యేకత ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కరుణాకర్ దర్శకుడుగా పరిచయమైన తొలిప్రేమ సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఈ సినిమాకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఇదే టైటిల్ తో సినిమా వస్తుంది అని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది ట్రోలింగ్ కూడా చేశారు. అయితే సినిమా సక్సెస్ అవ్వడంతో అందరూ సైలెంట్ అయిపోయారు.


ఆ సినిమా తర్వాత అక్కినేని అఖిల్ హీరోగా మిస్టర్ మజ్ను అనే సినిమాను చేశాడు వెంకీ. ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత చేసిన రంగ్ దే సినిమా కూడా సక్సెస్ కాలేదు. అయితే ఈ మూడు సినిమాల్లో కూడా సెకండ్ హాఫ్ అంత లండన్ లో జరుగుతుంది. వెంకీ అట్లూరి సినిమాలలో సెకండ్ హాఫ్ అంతా లండన్ లో జరుగుతుంది అంటూ అందరూ ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే మొత్తానికి వెంకీ తన పంథాను మార్చి తనదైన శైలిలో సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. తెలుగులో మొదటిసారి ధనుష్ హీరోగా చేసిన సినిమా సార్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక్కడ నుంచి వెంకీ అట్లూరి రేంజ్ కూడా మారిపోయింది.

రీసెంట్ గా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సినిమా లక్కీ భాస్కర్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దుల్కర్ కెరియర్ లో కూడా హైయెస్ట్ కలెక్షన్స్ తీసుకొచ్చింది. లక్కీ భాస్కర్ సినిమాను వెంకీ డిజైన్ చేసిన విధానం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంకీ లో ఇంత గొప్ప దర్శకుడు ఉన్నాడని చాలామంది అనుకున్నారు. ఇక తాజాగా వెంకి తమిళ్ హీరో సూర్యతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ దీనికి సంబంధించిన కథ కూడా సిద్ధం అయిపోయింది. దీనికి సూర్య కూడా ఓకే చెప్పేసారు. ఈ సినిమాలో సూర్య సరసన భాగ్యశ్రీ హీరోయిన్గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది అని చాలామంది ఊహిస్తున్నారు. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక సూర్య మరోపక్క చందు మొండేటి తో కూడా సినిమా చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. వెంకీ చేస్తున్న సినిమాలు చూస్తుంటే దాదాపు తెలుగు హీరోలను పక్కన పెట్టేసాడు అని అనిపిస్తుంది. ఒక సూర్యకి మొదటిసారి తెలుగులో ఏ స్థాయి హిట్ ఇస్తాడు వేచి చూడాలి.


Also Read : Allu Arjun – Trivikram movie: అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా కోసం వెయిటింగ్

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×