Telugu Warriors vs Bengal Tigers: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Celebrity Cricket League 2025 Tournament )… చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. ఎప్పటిలాగే స్టార్ హీరోలు అందరూ ఈ టోర్నమెంట్ లో పాల్గొని… అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. ఇక ఈ టోర్నమెంట్ లో టాలీవుడ్ ( Tollywood ) ఇండస్ట్రీ నుంచి తెలుగు వారియర్స్ జట్టు ( Telugu Warriors ) బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్ ( Akkineni Akhil ) , సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్, శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక , అశ్విన్ లాంటి ఎంతోమంది స్టార్లు ఈ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2025 టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు. గత పది రోజుల కిందట ప్రారంభమైన ఈ టోర్నమెంటులో ఇప్పటికే తెలుగు వారియర్స్ మూడు మ్యాచులు ఆడింది.
Also Read: IPL 2025 Schedule: ఐపీఎల్ 2025 షెడ్యూల్ వచ్చేసింది.. తొలి మ్యాచ్ ఎప్పుడు.. ఎక్కడ ఫ్రీగా చూడవచ్చు ?
ఈ మూడు మ్యాచ్ల్లో రెండు ఓడిపోయిన తెలుగు వారియర్స్ ఒక్క మ్యాచ్లో మాత్రం గెలిచింది. కర్ణాటక అలాగే… చెన్నై చేతిలో దారుణంగా ఓడిపోయింది తెలుగు వారియర్స్. కానీ లవర్స్ డే అయిన ఫిబ్రవరి 14వ తేదీన ఉప్పల్ స్టేడియంలో బోజ్ పూరి దబాంగ్స్ వర్సెస్ తెలుగు వారియర్స్ మధ్య ఫైట్ జరిగింది. ఇందులో అనూహ్యంగా తెలుగు వారియర్స్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే నిన్న… చెన్నై తో జరిగిన మ్యాచ్ లో మాత్రం తెలుగు వారియర్స్ ఓటమిపాలైంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన ఫాన్స్ అలాగే క్రికెట్ అభిమానులు… నిరాశకు గురయ్యారు.
హోమ్ గ్రౌండ్ అయిన ఉప్పల్లో కూడా గెలవకపోతే ఎలా అంటూ తెలుగు వారియర్స్ను ట్రోలింగ్ కూడా కొంతమంది చేస్తున్నారు. మనోళ్లకు… బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అంటున్నారు. ఇది ఇలా ఉండగా… తెలుగు వారియర్స్ తన తదుపరి మ్యాచ్ ఈనెల 23వ తేదీన ఆడనుంది. అదే రోజున ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య కూడా మ్యాచ్ ఉండనుంది. అయితే ఆ ఆదివారం రోజున అంటే ఫిబ్రవరి 23వ తేదీన తెలుగు వారియర్స్ వర్సెస్ బెంగాల్ టైగర్స్ ( Bengal Tigers ) మధ్య ఫైట్ ఉండనుంది. అయితే ఈ మ్యాచ్ మధ్యాహ్నం రెండు గంటలకే ప్రారంభమవుతుంది. సూరత్ వేదికగా… బెంగాల్ టైగర్స్ వర్సెస్ తెలుగు వారియర్స్ మధ్య ఫైట్ ఉండనుంది. అయితే ఈ మ్యాచ్ లో… గెలిస్తేనే తెలుగు వారియర్స్ కు సెమిస్ ఛాన్సులు ఉంటాయి. లేకపోతే తెలుగు వారియర్స్… సెమీ ఫైనల్ కు వెళ్లడం కష్టమే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
Also Read: Champions Trophy 2025: భారత్ మ్యాచ్‌లకు ఎక్స్‌ట్రా టికెట్లు.. ఇక ఫ్యాన్స్ కు పండగే !
తెలుగు వారియర్స్ స్క్వాడ్:
అఖిల్ అక్కినేని (c), సుధీర్ బాబు, సచిన్ జోషి, హరీష్ (wk), SS థమన్, ప్రిన్స్, అశ్విన్ బాబు, ఆది, రఘు, సామ్రాట్, నిఖిల్, రోషన్, ఆదర్శ్, ఖయ్యామ్, సాంబ, నంద, విశ్వ, వినయ్, అయ్యప్ప
బెంగాల్ టైగర్స్ స్క్వాడ్: జిషు సేన్‌గుప్తా (C ), ఇంద్రశిష్, మోహన్, సుమన్, జాయ్, జో, యూసుఫ్, జీతు కమల్, జమ్మీ బెనర్జీ, రత్నదీప్ ఘోష్, ఆనంద చౌదరి, శాండీ, ఆదిత్య రాయ్ బెనర్జీ, అర్మాన్ అహ్మద్, మాంటీ, రాహుల్ మజుందార్, గౌరవ్ చక్రబర్తి, బోనీ, బోనీ,