BigTV English

Money Heist Gold Robbery Karnataka : వెబ్ సిరీస్ చూసి బ్యాంకులో చోరీ.. 17 కిలోల బంగారం కోసం అదిరిపోయే ప్లాన్

Money Heist Gold Robbery Karnataka : వెబ్ సిరీస్ చూసి బ్యాంకులో చోరీ..  17 కిలోల బంగారం కోసం అదిరిపోయే ప్లాన్

Money Heist Gold Robbery Karnataka | సినిమాల్లో క్రైమ్ స్టోరీలు చూడడం అంటే అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే అవి చాలా ఆసక్తి కరంగా.. సస్పెన్స్ తో ఉంటాయి. కానీ అలాంటి ఘటనలు నిజజీవితంలో జరుగుతుంటే అందరూ భయపడతారు. అయితే థ్రిల్లర్ సినిమాకంటే ఎక్కువ ట్విస్టులతో కూడిన ఒక రియల్ లైఫ్ ఘటన కొన్ని నెలల క్రితం కర్ణాటక రాష్ట్రంలో సంచలనంగా మారింది. అయిదు నెలల క్రితం రాష్ట్రంలోని దావణగెరె జిల్లాలో జరిగిన ఒక హై ప్రొఫైల్ బ్యాంక్ చోరీ (Bank Robbery) కేసుని పోలీసులు అష్టకష్టాలు పడి తాజాగా పరిష్కరించారు.


ఏకంగా 17 కిలోల బంగారం చోరి కేసులో పోలీసులు మొత్తం బంగారాన్ని రికవర్ చేసి ఇప్పుడు ప్రశంసలందుకుంటున్నారు. అయితే ఈ కేసులో రూ.13 కోటల విలువైన బంగారాన్ని దొంగతనం చేసిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ దొంగతనం వెనుక ‘మనీ హీస్ట్’ వెబ్ సిరీస్ (Money Heist Web Series) ప్రేరణ ఉందని తెలిపారు.

Also Read: విద్యార్థి తండ్రితో టీచర్ ఎఫైర్, అవి చూపిస్తూ.. మనీ డిమాండ్, చివరికి..


ఎంతో పక్కా ప్లానింగ్ దొంగతనం జరిగిన ఈ కేసులో బ్యాంక్ సెక్యూరిటీని కూడా పోలీసులు అనుమానించారు. దీంతో సామాన్య వ్యాపార సంస్థల నిర్వహకులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

ప్లాన్ వెనుక మాస్టర్ మైండ్ అతనే..
ఈ దోపిడీకి (Bank Robbery).. విజయ్ కుమార్ (30) అనే వ్యక్తి మాస్టర్‌మైండ్. తమిళనాడు నుంచి వచ్చిన విజయ్, న్యామతి టౌన్‌లో బేకరీ, స్వీట్స్ షాప్ నడుపుతున్నాడు. 2023 మార్చిలో బిజినెస్ చేయడానికి రూ.15 లక్షల లోన్ కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో అప్లై చేశాడు. అయితే అతనికి బ్యాంక్ అధికారులు లోన్ రిజెక్ట్ చేశారు. కారణం సిబిల్ స్కోర్ తక్కువగా ఉండడం. అయినా పట్టు వదలకుండా తన బంధువుల పేరుతో విజయ్ కుమార్ ట్రై చేశాడు. అయితే ఈసారి కూడా ఫలితం లేకపోయింది.

ఈ లోన్ రిజెక్షన్‌.. విజయ్ లో కసిని పెంచింది. బ్యాంక్ అధికారులపై పగబట్టాడు విజయ్. అందుకే బ్యాంక్‌నే దోచేయాలని విజయ్ నిర్ణయించుకున్నాడు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో చాలా పాపులర్ అయిన స్పానిష్ భాష వెబ్ సిరసీ ‘మనీ హీస్ట్’ ను, యూట్యూబ్ వీడియోలను చాలా సార్లు పరిశీలించిన విజయ్ ప్లాన్ పక్కాగా రెడీ చేసుకున్నాడు. తన ప్లాన్ న అమలు చేయడానికి ముందుగా ఒక గ్రూప్ ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకోసం ముందుగా అతడి బావమరిది పరమానంద్ (30), సోదరుడు అజయ్ కుమార్ (28) లను ఒప్పించాడు. ఆ తరువాత స్థానికులైన చంద్రు (23), మంజునాథ్ (32), అభిషేక్ (23), లను కూడా తన ప్లాన్ లో కలుపు కున్నాడు.

దొంగతనం ఎలా చేశారంటే..
దావణగెరె ప్రాంతంలోని న్యామతి ఎస్‌బీఐ బ్రాంచ్‌లో (Nyamati SBI Branch) గత సంవత్సరం అక్టోబర్ 28 న ఈ దొంగతనం జరిగింది. ఆరు నెలల పాటు ప్లాన్ చేసిన ఈ గ్యాంగ్ శివమొగ్గ, న్యామతి లోకల్ షాప్స్ నుంచి హైడ్రాలిక్ కట్టర్, గ్యాస్ సిలిండర్ వంటి టూల్స్ కొనుగోలు చేసింది. సురహొన్నె స్కూల్‌లో రిహార్సల్స్ చేసి బ్యాంక్ సెక్యూరిటీ లోపాలను స్టడీ చేశారు.

ఆ రోజు రాత్రి విండో గ్రిల్స్ తొలగించి లోపలికి వెళ్లారు. గ్యాస్ కట్టర్‌తో లాకర్ తెరిచి 17 కిలోల గోల్డ్ జువెలరీని దోచుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా సీసీటీవీ కెమెరాలు, డీవీఆర్ తీసుకెళ్లారు. డాగ్ స్క్వాడ్‌ను కన్ఫ్యూజ్ చేయడానికి మిర్చి పౌడర్ చల్లారు. ఈ చర్యలతోనే పోలీసులు ఆశ్చర్య పోయారు. అందుకే విచారణ ముందు సాగడం కష్టంగా మారింది.

బంగారం ఎవరికీ అనుమానం రాకుండా ఎక్కడ దాచారు?..
దొంగతనం చేసిన తర్వాత ఓ సిల్వర్ కలర్ ఎస్‌యూవీ ట్రంక్‌లో మొత్తం బంగారాన్ని విజయ్ దాచాడు. కొన్ని రోజులు అక్కడే ఉంచి.. తర్వాత తమిళనాడులోని మధురైలో ఒక పాడుబడిన బావిలో లాకర్‌లో దాచాడు. కేసు కాస్త చల్లబడ్డాక కొంత గోల్డ్‌ను బయటకు తీసి బ్యాంక్‌లలో డిపాజిట్ చేశాడు. మిగిలిన దాన్ని గోల్డ్ షాప్స్‌లో అమ్మేశాడు. ఈ డబ్బుతో అభిషేక్, చంద్రు, మంజునాథ్‌లకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున ఇచ్చాడు. ఊరిలో ఇల్లు కట్టుకుని, ప్లాట్స్ కొన్నాడు. ఈ లగ్జరీ లైఫ్‌స్టైల్ చూసిన పోలీసులు అనుమానంతో మరింత లోతుగా విచారణ చేశారు.

విచారణలో ముప్పుతిప్పలు పడిన పోలీసులు
ఈ కేసు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. భద్రావతిలో జరిగిన ఇలాంటి రాబరీతో ఇంటర్‌స్టేట్ గ్యాంగ్ అనుమానం వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని కక్రాల గ్యాంగ్‌ను టార్గెట్ చేసినా ఆ లీడ్ వర్కౌట్ కాలేదు. చివరికి అనుకోకుండా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా న్యామతి ఎస్ బిఐ బ్యాంక్ కనెక్షన్ తమిళనాడులో తేలింది. ఐదు నెలల పాటు పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి.. ట్రాకింగ్ చేశారు. చివరకు నిందితులను పట్టుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితులు బ్యాంక్ లాకర్లను కట్ చేయడానికి ఉపయోగించింన హైడ్రాలిక్ కట్టర్, గ్యాస్ సిలిండర్‌లను సవలంగా సరస్సులో పడేశామని చెప్పారు. హార్డ్ డిస్క్‌ను కూడా డ్యామేజ్ చేసి అక్కడే విసిరామని అంగీకరించారు. ఈ రికవరీలో 509 కస్టమర్ల గోల్డ్ లోన్స్‌కు సంబంధించిన ఆభరణాలు ఉన్నాయి. 30 అడుగుల లోతులో ఉన్న బావి నుంచి బంగారం మొత్తం స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన బంగారాన్ని విక్రయించిన, తాకట్టు పెట్టిన షాపుల నుంచి కొంతమేర రికవరీ చేశారు. మిగతా బంగారం కూడా స్వాధీనం చేసుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు.

Related News

Deputy Cm: డిప్యుటీ సీఎం X అకౌంట్ హ్యాక్.. ఆ పోస్టులు ప్రత్యక్షం, ఇది పాకిస్తాన్ పనా?

Job Competition: 53,000 ప్యూన్ పోస్టులకు.. 25 లక్షల మంది పోటీ!

H-1B Visa: రద్దీగా ఎయిర్‌పోర్టులు .. అమెరికాకు ప్రవాసుల పయనం, పెరిగిన విమానాల టికెట్ల ధరలు

H-1B Visas: హెచ్-1బీ వీసాల ఫీజు పెంపు.. భారత టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటి? ఆ సమస్య తప్పదా?

UPS Deadline: UPSలోకి మారాలనుకునే ప్రభుత్వ ఉద్యోగులకు సెప్టెంబర్-30 డెడ్ లైన్

India Vs Pakistan: ఇస్లామిక్ నాటో పైనే పాకిస్తాన్ ఆశలు.. భారత్‌కు ముప్పు తప్పదా?

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Air India Flight: విశాఖ – హైదరాబాద్ విమానానికి.. తృటిలో తప్పిన ప్రమాదం

Big Stories

×