Chhaava : విక్కీ కౌశల్ (Vicky Kaushal) లీడ్ రోల్ పోషించిన లేటెస్ట్ హిస్టారికల్ మూవీ ‘ఛావా’ (Chhaava). ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మహారాష్ట్రలో ఈ సినిమాను టాక్స్ ఫ్రీగా ప్రకటించాలని రిక్వెస్ట్ చేస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసింది ముంబై డబ్బా వాలా అసోసియేషన్.
‘ఛావా’ మూవీ టాక్స్ ఫ్రీ
ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరోచిత ప్రయాణాన్ని ‘ఛావా’ మూవీలో చూపించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ముంబై డబ్బా వాలా అసోసియేషన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కు లేఖ రాసింది. అందులో “మా పూర్వీకులు ఛత్రపతి శంభాజీ మహారాజ్ సైన్యంలో యోధులు. యుద్ధభూమిలో ఆయనతో కలిసి పోరాడారు. మాకు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇద్దరూ గౌరవనీయమైన వ్యక్తులు. మరాఠా రాజు జీవితం, ఆయన త్యాగాలను ఎక్కువ మంది చూసి అర్థం చేసుకోవడానికి రాష్ట్రంలో ఈ సినిమాను పన్ను రహితంగా ప్రకటించడం చాలా ముఖ్యం. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన వారసత్వానికి నివాళిగా ఈ చిత్రాన్ని ట్యాక్స్ ఫ్రీగా ప్రకటించాలని డబ్బా వాలా అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ తలేఖర్ ఈ లేఖను రాశారు. మరి ఈ విషయంపై ముఖ్యమంత్రి ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్కీ కౌశల్ ఛత్రపతి శంబాజీ మహారాజ్ పాత్రలో కనిపించారు. రష్మిక మందన్న ఈ సినిమాలో శంభాజీ భార్య యేసుబాయిగా నటించింది. మాడాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దినేష్ విజన్ ఈ సినిమాను నిర్మించారు. ‘ఛావా’ సినిమాను ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించారు. ఇందులో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా తదితరులు కీలకపాత్రలు పోషించారు. సినిమాలో చివరి 40 నిమిషాలు అద్భుతంగా ఉందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. పైగా ఈ సినిమాను చూసిన ఆడియన్స్ ఎమోషనల్ అవుతూ బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
‘ఛావా’ కలెక్షన్స్
వారంలోపే ఈ మూవీ దాదాపు రూ. 140 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ‘ఛావా’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి రూ. 150 కోట్ల మార్క్ కు చేరువలో ఉంది. మొదటి రోజు ఈ మూవీ రూ. 31 కోట్లు, రెండో రోజు రూ. 37 కోట్లు, మూడో రోజు రూ. 48.5 కోట్లు రాబట్టింది. దీంతో ‘ఛావా’ 3 రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ. 116.5 కోట్లను వసూలు చేసింది. 4వ రోజుకే 150 కోట్ల మార్క్ కు చేరువగా వచ్చింది ఈ మూవీ.
తెలుగులో థియేటర్లలోకి ?
ఇక థియేటర్ రన్ పూర్తి అయిన తర్వాత ఈ మూవీ నెట్ ఫిక్స్ లో స్ట్రిమింగ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా మరో వైపు ఈ సినిమాను తెలుగులో చూడడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు టాలీవుడ్ ఆడియన్స్. సోషల్ మీడియా వేదికగా చిత్ర నిర్మాణ సంస్థ మడాక్ ఫిలిమ్స్ కు తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.