B9 Beverages Ltd: మైక్రో బ్రూవరీ, క్రాఫ్ట్ బీర్ తయారీదారులు, గ్లోబల్ బ్రూవర్ లు నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా బీరా 91 బీర్ ను ఉత్పత్తి చేసే కంపెనీ వినూత్నంగా ఆలోచించింది. 2026 ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్(IPO) కు ముందు బీరా-91 బీర్ ను ఉత్పత్తి చేసే కంపెనీ తన పేరును B9 బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి B9 బెవరేజెస్ లిమిటెడ్ మార్చుకుంది. అయితే ఈ పేరు మార్చుకునేందుకు ఆ కంపెనీ భారీ నష్టాల్లోకి వెళ్లింది. ఆ కంపెనీకి దాదాపు రూ.80 కోట్ల విలువైన నష్టం చేకూరింది.
కంపెనీ పేరు మార్చడంతో9 బెవరేజెస్ లిమిటెడ్ కంపెనీ నష్టాల పాలు చూసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అమ్మకాలు 22శాతం మేరకు తగ్గాయి. భారీ నష్టాలపాలైంది. 68 శాతం నష్టాలు పెరిగాయి. మైక్రోబ్రూవరీస్, క్రాఫ్ట్ బీర్ తయారీదారులు, గ్లోబల్ బ్రూవర్ల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా కంపెనీ బీర్ పేరు మార్చాలని నిర్ణయం తీసుకుంది.
ALSO READ: CBI Recruitment: సీబీఐలో 1000 ఉద్యోగాలకు ఎల్లుండే లాస్ట్ డేట్ మిత్రమా..!
కొత్త బీర్ బ్రాండ్ కోసం కంపెనీ అధిక మూలధన వ్యయం చేయాల్సి వచ్చింది. కంపెనీ డెవలప్ మెంట్ కోస తాజా నిధులను సేకరించడానికి IPO ప్లాన్ చేసింది. 2023లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)కి దేశంలోని మొత్తం బీర్ పరిశ్రమ ₹92,324 కోట్లను అందించింది. B9 బేవరేజెస్ 2023-24లో రూ.748 కోట్ల నికర నష్టాన్ని చూసింది. ఈ నష్టం దాని మొత్తం అమ్మకాల ₹638 కోట్లను కూడా అధిగమించిందని రిపోర్టులో తెలిపింది.
పేరు మార్చడం వల్ల కంపెనీ చాలా నష్టాల్లోకి పోయిందని బీ9 బేవరేజెస్ ఫౌండర్ అంకుర్ జైన్ తెలిపారు. పేరు మార్చడానికే తమ కంపెనీకి 4 నుంచి 6 నెలల సమయం పట్టింది. కొత్త పేరు వల్ల మేము రాష్ట్రాల్లో కొత్తగా అప్లికేషన్ పెట్టుకోవాల్సి వచ్చింది. దీని కారణంగా తమ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నప్పటికీ అమ్మకాలు జరగలేదు. దీంతో మా కంపెనీ తీవ్రంగా నష్టపోయింది’ అని ఆయన చెప్పారు. బీరా బ్రాండ్ కంపెనీ ఒక దశాబ్దం క్రితం బెల్జియం నుంచి హెఫ్వీజెన్ బ్రాండ్ కు చెందిన ఆల్కహాల్ ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. అయితే ఈ బ్రాండ్ ఆల్కహాల్ భారతదేశంలో కూడా ప్రారంభించారు. దీని కారణంగా అర డజన్ థర్డ్ పార్టీ బ్రూవరీలను ఒప్పందం కుదర్చుకున్నాయి.
ALSO READ:Realme P3 Series: రియల్‌మి P3 ప్రో.. ఓడియమ్మ, నీటిలో పడినా ఏం కాదా..? మస్త్ ఉంది గురూ!
బీరా వంటి అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌లు కేవలం అమ్మకాల ద్వారానే కాకుండా వినూత్న ఉత్పత్తులు, ప్రయోగాత్మక విధానాలను మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా బీర్ పరిశ్రమ రంగానికి గణనీయంగా దోహదపడుతున్నాయని నివేదిక పేర్కొంది. ఈ కంపెనీలు అన్నీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. గోధుమ, డార్క్ లాగర్ లేదా క్రాఫ్ట్ అనేవి కొత్త టేస్ట్ ను కలిగి ఉంటాయని బ్రూవర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(BAI) డైరెక్టర్ జనరల్ వినోద్ గిరి తెలిపారు