Vidaamuyarchi: సినిమాలు తీయడం ఈజీ.. కానీ, ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం కష్టం. ఎంత గొప్పగా తీశారు అన్నది కాదు పాయింట్. ఎంతలా ఆ సినిమాకు ప్రమోషన్స్ చేశారు అన్నది పాయింట్. ఒకప్పుడు సినిమాలకు ఇంత ప్రమోషన్స్ ఉండేవి కాదు. ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. ఆ హీరోను బట్టి థియేటర్స్ కు వెళ్లేవారు. కానీ, ఇప్పుడు అలా కాదు. కాలం మారింది. హీరో ఎవరు అన్నది కాకుండా కథ ఉందా.. కంటెంట్ ఉందా అనేది చూస్తున్నారు.
ఇక ప్రేక్షకులను థియేటర్ లో మెప్పించడం కన్నా ముందు థియేటర్ కు రప్పించడానికి మేకర్స్ కష్టపడాల్సి వస్తుంది. ఇంకా చెప్పాలంటే సినిమాకు ఎంత ఖర్చు పెడుతున్నారో.. ప్రమోషన్స్ కూడా అంతే ఖర్చుపెడుతున్నారు. అంత కష్టపడినా సినిమా హిట్ అవుతుంది అని చెప్పలేం. అంతెందుకు.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సరిగ్గా ప్రమోషన్స్ చేయకపోవడం కూడా పరాజయానికి ఒక కారణమే. అందులో పాన్ ఇండియా సినిమా అంటే ఇంకెంత ప్రమోషన్స్ చేయాలి. అందుకే సీనియర్ హీరోలు అయినా.. కుర్ర హీరోలు అయినా.. తమ సినిమా ప్రమోషన్స్ లో వైవిధ్యం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ, తమిళ్ హీరోలు మాత్రం మేము ప్రమోషన్స్ కు దూరం అని ముఖం మీదనే చెప్పుకొచ్చాస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరోల్లో తలా అజిత్ ఒకరు. ఆయనకు తమిళ్ లో ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలుగులో కూడా అంతే ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన నటించిన ఏ సినిమా అయినా తెలుగులో డబ్ అవుతూ ఉంటుంది. తాజాగా ఆయన నటించిన చిత్రం విదాముయర్చి. మగిజ్ తిరుమేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగులో టైటిల్ పెట్టకపోవడంతో ఎంత నష్టం జరిగిందో గుర్తించిన మేకర్స్ ఈ సినిమాకు తెలుగులో పట్టుదల అనే పేరును ఖరారు చేశారు. ఈ సినిమా రేపు రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఈ మధ్యనే అజిత్.. పద్మభూషణ్ వరించిన విషయం తెల్సిందే. అంత గొప్ప నటుడు సినిమా రిలీజ్ అంటే కొంచెం కూడా హడావిడి లేదు. అసలు తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా రిలీజ్ అన్న విషయం కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదు. తమిళ్ లో ఇప్పటికే థియేటర్స్ అన్ని కళకళలాడుతున్నాయి. పట్టుదల పాన్ ఇండియా మూవీ. అలాంటప్పుడు అక్కడ ఎలా అయితే ప్రమోషన్స్ చేసారో ఇక్కడ కూడా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Game Changer: అలికి పూసిన అరుగుమీద వీడియో సాంగ్.. సినిమాకు హైలైట్ అంటే ఇదేరా మావా
మొన్నటికి మొన్న తమిళ్ హీరో సూర్య నటించిన కంగువ సినిమాకు ప్రమోషన్స్ ఏ రేంజ్ లో చేసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీనియర్ హీరోలను కలవడం.. తెలుగులో అన్ని షోస్ కు వెళ్లడం.. ఇంటర్వ్యూలు ఇవ్వడం.. ఇలా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సూర్య తప్ప ఇంకెవరు కనిపించనంతగా ప్రమోషన్స్ చేశారు. అంత హైప్ తెచ్చుకున్నా ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
ఇక పట్టుదల సినిమాకు అయితే అసలు ఒక్క ఇంటర్వ్యూ లేదు .. ఒక ఈవెంట్ లేదు. సరే.. అజిత్ ప్రమోషన్స్ కు రాడు అన్నా కూడా చిత్రబృందంలో ఎవరైనా ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు. త్రిష, రెజీనా, అర్జున్ సర్జా ఇలా తెలుగులో నటించినవారు చాలామంది ఉన్నారు. ఒక్కరు కూడా ఈ సినిమా కోసం ప్రమోషన్ చేసినవారు కాదు. దీంతో తెలుగు ప్రేక్షకులు మండిపడుతున్నారు. ప్రమోషన్స్ చేయనప్పుడు సినిమాను మేమెందుకు ఆదరిస్తామని చెప్పుకొస్తున్నారు. పట్టుదల ఉంటే చాలదయ్యా.. ప్రమోషన్స్ కూడా ఉండాలి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక ఈ సినిమా గురించి చిత్రబృందమే మర్చిపోయినా మెగా మేనల్లుడు మాత్రం మర్చిపోలేదు. ప్రతివారం కొత్త సినిమాలు రిలీజ్ అయ్యే ముందు ఆ సినిమాకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పడం సాయి ధరమ్ తేజ్ కు అలవాటు. తాజాగా పట్టుదల సినిమాకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ పోస్ట్ చేశాడు. “అజిత్ సార్, ఆఫ్-స్క్రీన్ లో మీరు అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. దాని సాక్షిగా మీరు పెద్ద తెరపై కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను. రేపు గ్రాండ్ రిలీజ్ కానున్న విదాముయర్చి బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. మరి ఎలాంటి ప్రమోషన్స్ లేని ఈ సినిమా తెలుగులో ఎలాంటి విజయాన్ని అందుకుంటోందో చూడాలి.
#Ajith sir, Witnessed your ultimate triumph off-screen and wish you a blockbuster triumph on the big screen too. My best wishes to the entire team of #Vidaamuyarchi for the grand release tomorrow. ❤️#MagizhThirumeni sir, @trishtrashers garu,papa garu @ReginaCassandra,… pic.twitter.com/zF5gWEmILi
— Sai Dharam Tej (@IamSaiDharamTej) February 5, 2025