Game Changer: సాధారణంగా ప్రతి సినిమాలో 5 సాంగ్స్ ఉంటాయి.. కొన్ని సినిమాల్లో ఎక్కువ ఉండొచ్చు.. తక్కువ ఉండొచ్చు. అసలు ఇంకొన్ని సినిమాల్లో సాంగ్స్ ఉండకపోవచ్చు. సాంగ్స్ ఉన్న సినిమాల్లో ఎన్ని సాంగ్స్ ఉన్నా కూడా అందరికీ ఒక ఫేవరేట్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్.. కథ మొత్తాన్ని తెలియజేస్తుంది. అలాంటి పాటలు సినిమా హిట్ అయినా.. ప్లాప్ అయినా కూడా ప్రేక్షకుల మనస్సులో పదిలంగా ఉండిపోతాయి. అలికి పూసిన అరుగుమీద సాంగ్ కూడా గేమ్ ఛేంజర్ సినిమాకు అలాంటిందే.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ఎన్నో ఆశలతో నిర్మించిన ఈ సినిమా జనవరి 10 న రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకుంది. మూడేళ్లు ఈ సినిమా కోసం వైట్ చేయడం వలనో.. ఎక్కువ హైప్ పెట్టుకోవడం వలనో గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల మైండ్ కు ఎక్కలేదు. సినిమాలో చాలా మైనస్ లను ప్రేక్షకులు వెతికి పట్టుకొని మరీ ట్రోల్ చేశారు.
గేమ్ ఛేంజర్ సినిమాలో చరణ్ తండ్రీకొడుకులుగా రెండు పాత్రల్లో నటించాడు. కొడుకు రామ్ నందన్ పాత్ర ఏమో కానీ, తండ్రి అప్పన్న పాత్ర మాత్రం ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. సినిమా మొత్తం అప్పన్న పాత్రలోనే తెరకెక్కించినా.. ఇంత పరాజయం అయ్యేది కాదేమో అన్నది కొందరి మాట. ప్రజలకు మంచిచేసే నాయకుడిగా అప్పన్న.. భర్తకు తోడుగా ఉండే పార్వతిగా అంజలి నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. గేమ్ ఛేంజర్ సినిమా అంతా ఒక ఎత్తు అయితే.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా ఒక ఎత్తు.
ఇక ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సాంగే అలికి పూసిన అరుగుమీనా కలికి సుందరినై కూసుంటే.. పలకరించావేంటి ఓ దొరా.. చిలకముక్కు చిన్ని నా దొర. సినిమా మొత్తాన్ని హైలైట్ సాంగ్ అంటే ఇదే అని చెప్పొచ్చు. తాజాగా ఈ సాంగ్ వీడియోను మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. మొదటినుంచి ఈ సాంగ్ ను మేకర్స్ దాచిపెట్టారు. ప్రమోషన్స్ లో ఎక్కడా ఈ సాంగ్ గురించి చెప్పలేదు. రేపు రిలీజ్ అనగా ఈరోజు ఈ సాంగ్ లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఒక వేళా ఈ సాంగ్ కనుక ముందే వచ్చి ఉంటే .. సినిమాకు మరింత ప్లస్ అయ్యేది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
Vijay Devarakonda: బుద్దుందా విజయ్.. రష్మికను అలా వదిలేస్తావా.. ఆ హీరోను చూసి నేర్చుకో
అభ్యుదయం పార్టీ పెట్టి .. ప్రజల ముందు మాట్లాడడానికి తన నత్తి అడ్డువస్తుందని, ప్రజలకు మంచి చేయాలంటే గట్టిగా మాట్లాడి పోరాడాలి అనే తపనతో.. ఆ నత్తిని పోగొట్టుకోవడానికి అప్పన్న ఎలాంటి పనులు చేశాడు.. ? భర్త కోసం పార్వతి ఏం చేసింది.. ? అనేది ఎంతో అద్భుతంగా ఈ సాంగ్ లో చూపించారు. భర్త పడే ఆవేదనను తన ప్రేమతో పోగొట్టాలని.. భార్య తన భర్త గుణగణాలను చెప్పే లిరిక్స్ ను శ్యామ్ కాసర్ల ఎంతో అద్భుతంగా రాశాడు. ఇక అంతే అద్భుతంగా తన వాయిస్ తో ఈ సాంగ్ ను పాడి మెస్మరైజ్ చేసింది సింగర్ రోషిణి. థమన్ మ్యూజిక్ అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇకపోతే గేమ్ ఛేంజర్ త్వరలోనే ఓటీటీలోకి రానుంది. ఈ మధ్యనే ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొనుగోలు చేసింది. ఇక ఈ సినిమా ఈ శుక్రవారం అనగా ఫిబ్రవరి 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్ లో పరాజయాన్ని చవిచూసిన గేమ్ ఛేంజర్ థియేటర్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.