Indian Railway Tickets News: భారతీయ రైల్వే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ లో ఒకటిగా కొనసాగుతోంది. నిత్యం 20 వేల రైళ్లు తమ సేవలను కొనసాగిస్తున్నాయి. రోజూ 2.5 కోట్ల మంది రైల్వే ప్రయాణం చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకర ప్రయాణం చేయాలనుకునే వాళ్లు ట్రైన్ జర్నీకి మొగ్గు చూపుతారు. రైలు ప్రయాణం చేయాలంటే కచ్చితంగా రైలు టికెట్ ఉండాల్సిందే. కొన్ని అనివార్య పరిస్థితులలో టికెట్ పోయినా, చిరిగినా ప్రయాణం చేయలేమేమో అని ప్యాసింజర్లు కంగారు పడతారు. అయితే.. ఇకపై ఆ టెన్షన్ అవసరం లేదంటున్నది రైల్వే సంస్థ. సింపుల్ గా డూప్లికేట టికెట్ తీసుకొని హ్యాపీగా ప్రయాణం చెయ్యొచ్చు అంటున్నది.
రైలు టికెట్ పోతే ఏం చేయాలంటే?
ఒకవేళ మీరు టికెట్ పోగొట్టుకున్నట్లు అయితే ముందుగా ఈ విషయాన్ని మీరు ప్రయాణించే రైల్లోని టీటీఈకి చెప్పాలి. పోయిన టికెట్ కు బదులుగా డూప్లికేట్ టికెట్ ఇవ్వమని కోరాలి. మీ వివరాలను టీటీఈకి చెప్తే అతడు డూప్లికేట్ టికెట్ ను అందిస్తారు. అయితే, డూప్లికేట్ టికెట్ ను ఉంచితంగా ఇవ్వరు. కొంత ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది.
డూప్లికేట్ టికెట్ కోసం ఎంత ఫీజు చెల్లించాలంటే?
పోగొట్టుకున్న టికెట్ స్థానంలో డూప్లికేట్ టికెట్ పొందేందుకు ఆయా క్లాస్ లను బట్టి ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఆయా రైళ్లు ప్రయాణించే క్లాసులను పట్టి ఈ ఛార్జ్ వసూళు చేస్తారు. స్లీపర్ క్లాస్ లేదంటే సెకండ్ క్లాస్ లో ప్రయాణిస్తూ, టికెట్ పోగొట్టుకున్నట్లు అయితే, డూప్లికేట్ టికెట్ కోసం 50 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ క్లాస్ టికెట్ ను పోగొట్టుకుంటే రూ. 100 చెల్లించి డూప్లికేట్ టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాదని మీ దగ్గర ఉన్న ట్రైన్ టికెట్ చిరిగిపోతే.. ప్రయాణ ఛార్జీలో 25 శాతం డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు టీటీఈ డూప్లికేట్ టికెట్ ను అందిస్తాడు. సో ఇకపై మీరు రైలు ప్రయాణం చేసే సమయంలో మీ టికెట్ పోయినా, చిరిగిపోయినా కంగారు పడకుండా రైల్వే అధికారులకు చెప్పాలి. నిర్ణీత ఫీజును చెల్లించి కొత్త(డూప్లికేట్) టికెట్ ను పొందండి. హ్యాపీగా జర్నీ చేయండి.
చివరి నిమిషంలో టికెట్ ఎలా పొందాలంటే?
ఇక చివరి నిమిషంలో ప్రయాణం చేయాలనుకునే వాళ్లు ‘కరెంట్ టికెట్ సిస్టమ్’ ద్వారా.. రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు కూడా టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. ముందుగా మీరు వెళ్లాలి అనుకున్న రైలులో బెర్తులు ఖాళీగా ఉన్నాయో? లేదో? తెలుసుకోవాలి. ఇందుకోసం ముందుగా IRCTC వెబ్ సైట్ లేదంటే యాప్ ఓపెన్ చేయాలి. ట్రైన్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఛార్ట్ వెయికెన్సీ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ లిస్టు మీద్ క్లిక్ చేయాలి. మీరు వెళ్లాల్సిన రైలు పేరు, నెంబర్, ఎక్కాల్సిన స్టేషన్ వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత ‘గెట్ ట్రైన్ ఛార్ట్’ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. వెంటనే రైల్లో ఉన్న ఖాళీ సీట్ల వివరాలను డిస్ ప్లే అవుతాయి. బెర్త్ లు ఖాళీగా ఉంటే మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ టికెట్లు లేకపోతే జీరో డిస్ ప్లే అవుతుంది.
Read Also: అర్జెంట్ గా రైల్లో వెళ్లాలా? డోంట్ వర్రీ.. 5 నిమిషాల ముందు కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు!