BigTV English

Arjun Sarja: అమ్మ కోసం.. తన డ్రీమ్ ను వదిలేసుకున్న స్టార్ హీరో..!

Arjun Sarja: అమ్మ కోసం.. తన డ్రీమ్ ను వదిలేసుకున్న స్టార్ హీరో..!

Arjun Sarja:యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ( Arjun Sarja) అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈయన తన యాక్టింగ్ తో యాక్షన్ కింగ్ గా టాలీవుడ్ లో ముద్ర వేసుకున్నారు. అయితే అలాంటి అర్జున్ సర్జ తెలుగు వాడు కానప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో హీరోగా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఒకప్పుడు అర్జున్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టేవి. ఈయన సినిమాలు ఎన్నో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా వచ్చి హిట్స్ కొట్టాయి. అయితే అలాంటి యాక్షన్ కింగ్ అర్జున్ అసలు డ్రీమ్ హీరో అవ్వడం కాదట. కేవలం తన తల్లి కారణంగా తన డ్రీమ్ ని వదులుకున్నారట. మరి ఇంతకీ యాక్షన్ కింగ్ అర్జున్ ఏం అవ్వాలనుకున్నారు..? ఆయన డ్రీమ్ ఏంటి.. ? ఎందుకు తన డ్రీమ్ కి తల్లి అడ్డుపడింది? అనేది ఇప్పుడు చూద్దాం..


తల్లి కోసం తన డ్రీమ్ ను పక్కన పెట్టిన అర్జున్..

యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగులో నటించిన మొట్టమొదటి మూవీ నన్ను ప్రేమించు(Nannu Preminchu)..ఈ సినిమా తర్వాత అర్జున్ ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు.కేవలం తెలుగు మాత్రమే కాకుండా కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఈయన హీరోగా రాణించారు. ఇక హీరోగా అవకాశాలు తగ్గాక విలన్ పాత్రల్లో కూడా చేస్తున్నారు. అయితే అలాంటి అర్జున్ (Arjun) తాజాగా ఓ కార్యక్రమంలో తన డ్రీమ్ ఏంటో బయట పెట్టారు. అర్జున్ మాట్లాడుతూ.. “నాకు చిన్నప్పటి నుండి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనే కోరిక ఉండేది. నేను ఆర్మీ అవ్వాలని అన్నింటికీ సిద్ధమయ్యాను. ఎప్పటినుండో అనుకుంటున్న నా డ్రీమ్ నెరవేరబోతుంది అని ఊహించాను. అలాగే ఆర్మీ ఫామ్ ని తీసుకువెళ్లి మా అమ్మకు సంతకం పెట్టమని ఇచ్చాను. కానీ ఆ ఆర్మీ ఫామ్ లో ఆర్మీ లో జాయిన్ అయిన వ్యక్తికి ఏమైనా మా బాధ్యత కాదు అని, ఆ వ్యక్తి ప్రాణానికి మేము హామీ ఇవ్వమని రాసుండడంతో మా అమ్మ అది చదివి షాక్ అయింది. అంతే కాదు నువ్వు ఆర్మీలో జాయిన్ అవ్వడానికి వీల్లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. ఆర్మీ ఫామ్ పై సైన్ చేయడానికి కూడా ఒప్పుకోలేదు. ఇక అమ్మ కన్నీళ్లు చూడలేక నేను ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనే నా డ్రీమ్ ని సైతం వదిలేసుకున్నాను”.. అంటూ అర్జున్(Arjun)ఆ కార్యక్రమంలో తన డ్రీమ్ ఏంటో బయట పెట్టారు.


తన కోరికను సినిమాల ద్వారా తీర్చుకున్న అర్జున్..

ఇక హీరో అర్జున్ కి దేశభక్తి చాలా ఎక్కువ.. దేశం మీద ఉన్న గౌరవంతో ఆయన తన చేతిపై జాతీయ జెండాని పచ్చబొట్టు వేయించుకున్నారు. అంతేకాదు తన రియల్ లైఫ్ లో అవ్వాలనుకున్న ఆర్మీ ఆఫీసర్ ని పలు సినిమాల్లో చేసి రీల్ ఆర్మీ ఆఫీసర్ గా, పోలీస్ గా కనిపించారు. అలా రియల్ లైఫ్ లో ఉన్న తన డ్రీమ్ ని రీల్ లైఫ్ లో నెరవేర్చుకున్నారు. ఏది ఏమైనప్పటికీ యాక్షన్ కింగ్ అర్జున్ ఆర్మీ ఆఫీసర్ అవ్వబోయి హీరో అయ్యాడని తెలుస్తోంది. ఇక అర్జున్ తండ్రి కూడా కన్నడలో కొన్ని సినిమాల్లో నటించారు. అలాగే ఆయన తల్లి ఒక టీచర్.. ఇక అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అజిత్ హీరోగా చేసిన విడాముయార్చి (Vidamuyarchi) మూవీలో విలన్ పాత్రలో నటించారు.ఈ సినిమా ఫిబ్రవరి 6న రిలీజ్ కాబోతోంది.

Related News

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Alekhya Chitti Sisters: దెబ్బకు ఆపరేషన్‌ చేసుకుని జెండర్ మార్చేసిన అలేఖ్య.. ట్రోల్స్‌పై సుమ రియాక్షన్!

Miss Universe -2025: మిస్ యూనివర్స్ 2025 విజేతగా రాజస్థాన్ బ్యూటీ!

Rahul Sipligunj – Rathika : ఘనంగా రాహుల్ ఎంగేజ్మెంట్, గుక్కపెట్టి ఏడుస్తున్న రతిక

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Big Stories

×