Varalakshmi Sarathkumar : హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె తెలుగులో కూడా పలు సినిమాల్లో హీరోయిన్గా అలాగే కీలక పాత్రలో నటిస్తూ బిజీగా ఉంది. తెలుగులో క్రాక్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె విలన్ రోల్ లో మెప్పించింది. ప్రస్తుతం హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తుంది. ప్రశాంత్ వర్మ తేజ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ సినిమాలో హీరోలో నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. తర్వాత ప్రధాన పాత్రల్లో పలు సినిమాల్లో నటించింది. ఈమె సినిమాలతో పాటు బుల్లితెరపై జరుగుతున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటుంది తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈమె లైవ్ లోనే కన్నీళ్లు పెట్టుకుంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరలక్ష్మి శరత్ కుమార్ అందరి ముందరే అంతగా ఎందుకు ఏడ్చిందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..
తమిళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవల తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూనే ప్రొఫెషనల్ లైఫ్ ని కూడా సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తుంది. మొన్నటి వరకు స్టార్ హీరోల సినిమాల్లో హీరోలో నటించిన ఈ నటి ప్రస్తుతం హీరోయిన్గా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. సినిమాల ప్రమోషన్లతో పాటు టీవీ కార్యక్రమాల్లో కూడా ఈమె పాల్గొంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఓ టీవీ ఛానల్ లో డాన్స్ షోలో పాల్గొంది. అందులో ఓ డాన్సర్ డాన్స్ వేసిన తర్వాత తన జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపులు గురించి అద్దంలో తనని తాను చూసుకుంటూ వివరిస్తుంది. ఆమె ఒక్కసారిగా తన జీవితాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అవుతుంది . అది చూసిన వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది.
నీ జీవితంలో ఎలాగైతే జరిగిందో నా జీవితంలో కూడా అలానే జరిగింది నేను చూస్తుంటే నా జీవితమే నాకు మళ్ళీ గుర్తొచ్చేసింది నేను చిన్నప్పుడు అలాంటి బాధలను ఎదుర్కొన్నాను అని వరలక్ష్మి శరత్ కుమార్ అన్నారు. చిన్న తనంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకుని ఎమోషనలైంది. నేనూ చిన్నతనంలోనే లైంగిక వేధింపుల బారిన పడ్డాను. నీది నాదీ ఒకటే కథ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు అంత పెద్ద స్టార్ కూతురు అయ్యి ఇలాంటి బాధలు అనుభవించిందా అంటూ సోషల్ మీడియాలో కామెంట్ లో పెడుతున్నారు.
ఇక వరలక్ష్మి శరత్ కుమార్ సినిమాల విషయానికొస్తే.. హనుమాన్ మూవీతో మెప్పించింది. తర్వాత లేడి ఒరియేంటెడ్ చిత్రం శబరిలో నటించింది. ఆ మూవీ అనుకున్న హెట్టినైతే అందుకోకపోయినా సినిమా పర్వాలేదు అనే టాక్ ని మాత్రం అందుకుంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ శివంగి సినిమాలో నటిస్తుంది. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక శివంగి సినిమాను ఫస్ట్ కాపీ మూవీస్ బ్యానర్‌పై సురేష్ బాబు నిర్మించారు. అయితే పవర్ ఫుల్ విమెన్ సెంట్రిక్ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ మూవీలో డాక్టర్ కోయి కిషోర్, జాన్ విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.