Vidhya Balan: నేడు మహిళా దినోత్సవం సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న విషయాలపై.. స్త్రీ , పురుష విభేదం పై ప్రస్తావించి వార్తల్లో నిలుస్తున్నారు. ఇక అలాంటి వారిలో విద్యాబాలన్ (Vidhya Balan) కూడా ఒకరు. తన కెరియర్ ఆరంభంలో ఎదురైన పోరాటాల గురించి మీడియాని ప్రశ్నించిన విద్యాబాలన్.. దానిని ఎప్పుడూ పోరాటంగా చూడలేదని, ప్రయాణంలో ఒక భాగంగా మాత్రమే చూశాను అంటూ తెలిపింది. ముఖ్యంగా దక్షిణ భారత కుటుంబం నుండి వచ్చిన విద్యాబాలన్ సహనం ముఖ్యం అని నమ్ముతున్నానని, తిరస్కారాలను ఎదుర్కొన్నప్పటికీ అవకాశాలను వదులుకోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. కఠిన సమయాల్లో కూడా తనను తాను బెస్ట్ గా ఊహించుకోవడానికి కుటుంబం ఎప్పుడూ మద్దతుగా నిలిచిందని, తన కుటుంబానికి తాను రుణపడి ఉంటాను అని కూడా విద్యాబాలన్ తెలిపింది.
ఇకపోతే మహిళలు, పురుషులతో సమాన ప్రాతినిధ్యం సాధించిన తర్వాత అణిగిమణిగి ఉండాల్సిన పనిలేదు అని తెలిపిన విద్యాబాలన్.. మహిళా సాధికారత గురించి మాట్లాడుతూ.. సిల్క్ స్మిత (Silk Smitha) గురించి గొప్పగా చెప్పుకొచ్చింది. నటిగా అడుగుపెట్టడం మాత్రమే కాదు తమదైన మార్గాన్ని నిర్ణయించుకునే శక్తిని కలిగి ఉండడమే అసలైన సాధికారత. ది డర్టీ పిక్చర్ లో నా పాత్రను ప్రతిబింబిస్తూ నిజమైన సాధికారత.. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సొంత ఎంపికలతో ముందుకు సాగడమే. ముఖ్యంగా నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపడంలో సిల్క్ స్మిత ధైర్యాన్ని నేను ఎప్పటికీ మెచ్చుకుంటాను అంటూ విద్యాబాలన్ తెలిపింది.
ALSO READ:Dhee Re Release: రీ- రిలీజ్ కి సిద్ధమైన మంచు విష్ణు మూవీ.. ఆయన కామెడీ కోసమైనా చూడాల్సిందే..!
విద్యాబాలన్ మాట్లాడుతూ.. ది డర్టీ పిక్చర్ విజయం తర్వాత నాకు చాలా బ్రాండ్ ఎండార్స్మెంట్ కోసం ఆఫర్లు వచ్చాయి. కానీ దురదృష్టవశాత్తు కారు బ్రాండ్లు, బ్యాంకులు ఎప్పుడు నన్ను సంప్రదించలేదు. మహిళలు డ్రైవింగ్ చేయడానికి, ఆర్థిక నిర్వహణకు సరిపోరని అనుకున్నారో ఏమో.. అందుకే నాకు అవకాశం ఇవ్వలేదు. సమాజంలో అంతర్లీనంగా ఉన్న లైంగిక వివక్ష ఎప్పుడు పోతుందో తెలియదు కానీ ఇంత డెవలప్మెంట్ జరిగినా సరే అమ్మాయిలను ఇంకా తక్కువ చూపే చూస్తున్నారు. ముఖ్యంగా భారతదేశంలో మహిళలు తమ ఆర్థిక వ్యవహారాలను తమ తండ్రి లేదా భర్త చేతిలో వదిలేయాలని భావిస్తున్నారు. ఈ రకంగా మహిళలు కొంచెం ఆలోచించాలి అంటూ తెలిపింది. విద్యాబాలన్ ఆర్థిక వ్యవహారాలలో స్వతంత్రురాలు అయినప్పటి నుండి ఎక్కువగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టిందట. మహిళలు తమకు అవసరమైన డబ్బును తామే సంపాదించుకోవాలని కూడా తెలిపింది. ఏది ఏమైనా విద్యాబాలన్ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఇక సిల్క్ స్మిత గురించి ఆమె మాట్లాడుతూ.. సమాజంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్నారు. అయితే అలాంటి ఆమె కొన్ని అనుకోని కారణాల వల్ల మరణించడం ఇప్పటికీ బాధాకరం. ముఖ్యంగా ఆమె జీవితం ఎంతోమందికి ఆదర్శ దాయకం. ఆమె లాంటి వ్యక్తులను చూసి ఎంతో నేర్చుకోవాలి అంటూ కూడా విద్యాబాలన్ తెలిపినట్లు సమాచారం. ఏది ఏమైనా విద్యాబాలన్ సిల్క్ స్మిత గురించి ఆమె ఇండస్ట్రీలో అందరికీ ఆదర్శంగా నిలిచిన తీరు గురించి మాట్లాడుతూ ప్రశంసలు కురిపించింది.