Thalapathy 69:కోలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దళపతి (Vijay thalapathy) చివరి సినిమాగా “దళపతి 69” అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. హెచ్.వినోత్ (H.Vinoth) దర్శకత్వంలో పూజా హెగ్డే (Pooja hegde) హీరోయిన్ గా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది. విజయ్ దళపతి చివరి సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాదు ఈ సినిమా తర్వాత ఆయన పూర్తిగా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి, రాజకీయాల వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం కూడా ఈ సినిమాను ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు. ఇకపోతే ఈ సినిమాను బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’రీమేక్ గా రూపొందించబోతున్నారు. ఇక ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ రివీల్ చేశారు మేకర్స్.
దళపతి 69 టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రివీల్..
‘జన నాయగన్’ అని టైటిల్ ను దళపతి 69 కి ఫిక్స్ చేసినట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఈ టైటిల్ తో పాటు పోస్టర్ కూడా రివీల్ చేశారు. ఈ పోస్టర్లో దళపతి విజయ్ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అందరిని మెస్మరైజ్ చేశారు. అంతే కాదు ఈ పోస్టర్ విషయానికి వస్తే.. పోస్టర్లో వెనుక నుండి జనంతో కలిసి విజయ్ దళపతి సెల్ఫీ తీసుకుంటున్నట్టు పోస్టర్ రివీల్ చేశారు. సెల్ఫీకి , ఆ టైటిల్ కి పూర్తీ న్యాయం చేసినట్టుగా కనిపిస్తోంది. ఇకపోతే ఈ చిత్రంతో దళపతి విజయ్ సినీ జర్నీ కూడా ముగుస్తుంది. దీంతో ఒక శకం ముగిసినట్టే అని సినీ వర్గాలు కూడా చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా విజయ్ కి ఫేర్వెల్ గా ఉండబోతుందని అభిమానులు, ఈ సినిమాను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేలా ఉంటుందని కూడా మేకర్స్ భావిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్ అర్థం విషయానికి వస్తే.. జన నాయకుడు.. ఇన్నేళ్లలో విజయ్ చేసిన సేవా కార్యక్రమాలు, సినీ పరిశ్రమలో సాధించిన విజయాలకు చిహ్నంగా ఈ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమాకి మరొకసారి అనిరుద్ రవిచంద్రన్ (Anirudh Ravichandran) సంగీతాన్ని అందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని వెంకట.కే.నారాయణ నిర్మిస్తూ ఉండగా.. అదిరిపోయే లైనప్ తో కేవీఎన్ ప్రొడక్షన్స్ మునుముందు బ్లాక్ బాస్టర్ హిట్ చిత్రాలను అందించనుంది అని సమాచారం. ఏది ఏమైనా విజయ్ దళపతి చివరి సినిమాకు జన నాయగన్ టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రివీల్ చేయడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాకి ‘నాళయ్య తీర్పు’ అని టైటిల్ పేరు ఫిక్స్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా టైటిల్ తోనే 1992లో విజయ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. మళ్లీ అదే పేరును ఆయన చివరి సినిమాకు పెట్టబోతున్నారని వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే విజయ్ తొలి సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు చివరి సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలితే.. డిజాస్టర్ తోనే ఆయన సినీ కెరియర్ ముగుస్తుందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అందరి ఆలోచనలను దృష్టిలో పెట్టుకొని ప్రజా నాయకుడిగా టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. మొత్తానికైతే టైటిల్ తో పాటు పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.