Pushpa 3 Update: అల్లు అర్జున్ సినీ కెరీయర్ ను ఒక్కసారిగా మార్చేసిన చిత్రం పుష్ప(Pushpa ). ఈ సినిమాతో ఏకంగా నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ (Allu Arjun). సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా, అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించారు. అలాగే సునీల్, అనసూయ తో పాటు పలువురు కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా విజయం సాధించడంతో ఈ సినిమా సీక్వెల్ గా పుష్ప 2 సినిమా కూడా గత ఏడాది డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది.
పుష్ప 3 లో విజయ్ దేవరకొండ తో పాటు మరో స్టార్ హీరో..
ఇక ఈ సినిమాకి పార్ట్ 3 కూడా ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోని 2026లో పుష్ప 3 సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది అని మేకర్స్ కూడా ప్రకటించారు. దీంతో ఈ సీక్వెల్ పై ఇప్పటికే పలు రూమర్లు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా పుష్ప 3లో అల్లు అర్జున్ తో పాటు మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా నటించబోతున్నట్లు సమాచారం . అయితే ఇలా వార్తలు జోరుగా సాగుతున్న నేపథ్యంలో తాజాగా డైరెక్టర్ సుకుమార్ కూడా స్వయంగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. పుష్ప 3 లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) విలన్ గా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కానీ విజయ్ దేవరకొండ మాత్రమే కాదు ఇందులో నాచురల్ స్టార్ నాని (Hero Nani) కూడా విలన్ గా నటించనున్నట్లు సమాచారం.
Sailesh Kolanu: చిత్ర బృందం కష్టాన్ని దొంగలిస్తున్నారు.. లీకులపై హిట్ డైరెక్టర్ అసహనం..!
స్పందించిన డైరెక్టర్ సుకుమార్..
ఈ నేపథ్యంలోని ఇటీవల ఒక కళాశాల కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు సుకుమార్ కు కూడా ఇదే ప్రశ్న ఎదురయింది. పుష్ప3 గురించి ఏదైనా చెప్పండి అని సుకుమార్ ని అడగగా.. 2025లో సుకుమార్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేడని, 2026 లో మాత్రమే సుకుమార్కి ఆ సంగతి తెలుస్తుంది అని చాలా తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకున్నారు డైరెక్టర్ సుకుమార్.ఇకపోతే పుష్ప2 సినిమా క్లైమాక్స్లో విలన్ ఎంట్రీ ని చూపించిన మేకర్స్ ఆయన ఫేస్ ని మాత్రం రివీల్ చేయలేదు. ముఖ్యంగా పుష్ప రాజును చంపడానికి విలన్ పూల గుత్తిలో బాంబును పంపుతాడు. డిటోనేటర్ నొక్కితే పుష్ప ఇంట్లో బాంబు పేలిన దృశ్యం మనకు కనిపిస్తుంది. కానీ బాంబు ఎవరు పెట్టారు ..? ఆ బటన్ ను ఎవరు నొక్కారు? అనేది మాత్రం చూపించలేదు. ఇక ఈ విషయాలు అన్నీ తెలియాలి అంటే పుష్ప 3 కోసం ఎదురు చూడాల్సిందే. ఇక మరొకవైపు పుష్ప 2 తర్వాత సుకుమార్ హీరో విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే దానిని పక్కన పెట్టేసి ఇప్పుడు విజయ్ దేవరకొండ తోనే పుష్ప3 ను చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య రాబోతున్న పుష్ప 3 అల్లు అర్జున్ కి మరి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి