Beetroot Raita: పెరుగు, బీట్‌రూట్ కలిపి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ మిశ్రమం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. ఇందులో ఐరన్, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మీరు పెరుగు, బీట్‌రూట్‌ను కలిపి తీసుకుంటే.. అది మీ మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా రక్త హీనత కూడా తొలగిపోతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న బీట్ రూట్ రైతా తినడం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బీట్ రూట్ రైతా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
రక్త పోటును నియంత్రిస్తుంది:
పెరుగు, బీట్ రూట్ కలిపి తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బీట్ రూట్‌లో మంచి మొత్తంలో ఐరన్ కలిగి ఉందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఇది రక్త ప్రవాహాన్ని మెరుగు పరుస్తుంది. పెరుగు ఒక ప్రోబయోటిక్ ఆహారం అని చెప్పవచ్చు. ఇది మీ రక్త పోటును చాలా వరకు నియంత్రించగలుగుతుంది. మీరు మీ శరీరంలోని రక్తపోటును నియంత్రించాలనుకుంటే.. పెరుగు రైతా తినడం చాలా అలవాటు చేసుకోవాలి.
రక్తహీనత తొలగిపోతుంది:
పెరుగు, బీట్‌రూట్ కలిపి తీసుకోవడం వల్ల మీ శరీరంలో రక్తహీనతను అధిగమించవచ్చు. ఇందులో మంచి మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఇది మీ రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని నియంత్రిస్తుంది. మీరు ఐరన్ లోపంతో ఇబ్బంది పడుతుంటే.. బీట్‌రూట్ రైతాను తయారు చేసి తినండి.
చక్కెర స్థాయిని నియంత్రించండి:
శరీరంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి మీరు బీట్ రూట్, పెరుగును కలిపి తినవచ్చు. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. బీట్ రూట్ చెక్కర స్థాయిని నియంత్రిస్తుంది.
జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది:
జీర్ణ సమస్యలకు బీట్‌రూట్, పెరుగు మిశ్రమం ఉత్తమంగా పనిచేస్తుంది. ఇది ఫైబర్ యొక్క చాలా మంచి మూలం అని చెప్పవచ్చు. ఇది జీర్ణ క్రియకు మేలు చేస్తుంది. ఇదే కాకుండా.. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యను తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు బీట్ రూట్ రైతా తినడం చాలా మంచిది.
Also Read: ఇంట్లోనే ఫేస్ క్రీమ్.. తయారు చేసుకుందామా ?
రోగనిరోధక శక్తి:
బలహీనమైన రోగనిరోధక శక్తిని పెంచడానికి, మీరు బీట్‌రూట్, పెరుగుతో తయారు చేసిన రైతాను తినవచ్చు. బీట్‌రూట్‌లో బీటాకానిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మీ రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు.. బలహీనమైన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. బీట్‌రూట్, పెరుగు కలిపి తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తరచుగా దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరగడానికి బీట్ రూట్ రైతా ఉపయోగపడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.