Vijay Deverakonda:రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరొకవైపు వ్యాపారాలు చేస్తూ భారీగా సంపాదిస్తున్నారు. అందులో భాగంగానే ‘రౌడీ బ్రాండ్స్’ పేరిట దుస్తుల వ్యాపారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే.అందులో భాగంగానే ఈయన తన రౌడీ బ్రాండ్ స్టోర్ ను హైదరాబాదులో కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్(Allu Arjun)పై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. అందులో భాగంగానే అల్లు అర్జున్ కి రౌడీ బ్రాండ్ డ్రెస్ లను అలాగే అల్లు అర్జున్ పిల్లల కోసం కొన్ని బర్గర్ లను కూడా విజయ్ దేవరకొండ పంపారు. ఇందుకు సంబంధించిన ఫోటోని అల్లు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకుంటూ..” మై స్వీట్ బ్రదర్.. ఎప్పుడు నువ్వు సర్ప్రైజ్ చేస్తుంటావు.. సో స్వీట్.. ” అని తన స్టోరీలో పోస్ట్ పెట్టారు.
అల్లు అర్జున్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రౌడీ హీరో..
అటు గతంలో కూడా అల్లు అర్జున్ కు విజయ్ గిఫ్టులు పంపిన విషయం తెలిసిందే. పుష్ప 2 రిలీస్ సందర్భంగా ‘పుష్ప’ పేరుతో కూడిన టీ షర్టులను పంపారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ..” నా స్వీట్ బ్రదర్.. నీ ప్రేమకు కృతజ్ఞతలు..” అని ఇవన్నీ పేర్కొన్నారు. విజయ్ కూడా.” లవ్ యూ అన్నా.. మన సాంప్రదాయాలు ఇలాగే కొనసాగుతాయి” అంటూ రిప్లై ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా ఇప్పుడు ఇద్దరి హీరోల అభిమానులు, తమ హీరోల మధ్య ఉండే ప్రేమానురాగాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్ కెరియర్:
అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ‘పుష్ప’ సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్. అంతేకాదు ఈ సినిమాలో విలక్షణమైన నటన కనబరిచి, ఏకంగా జాతీయస్థాయిలో నేషనల్ అవార్డు అందుకున్నారు. అంతేకాదు టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి హీరోగా కూడా రికార్డ్ సృష్టించారు అల్లు అర్జున్. ఆ తర్వాత ‘పుష్ప2’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకొని ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించారు. ఇక ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో #AA 22 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ కెరియర్..
ఒక విజయ్ దేవరకొండ కెరియర్ విషయానికి వస్తే.. సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి (Gautham Thinnanuri) దర్శకత్వంలో ‘కింగ్డమ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాతో ఎలాగైనా విజయం సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు విజయ్ దేవరకొండ. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి. ఏదేమైనా విజయ్ దేవరకొండ ఒకవైపు హీరోగా, మరొకవైపు ఇలా రౌడీ బ్రాండ్ పేరిట దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించి, రెండు చేతుల భారీగా సంపాదిస్తున్నారని చెప్పవచ్చు.