Nani : ప్రతి పరిశ్రమలోనూ పోటీ పడటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే సినిమా ఫీల్డ్ లో కూడా పాట పోటీగా ఒకేరోజు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. మామూలు టైంలో కంటే ఒకప్పుడు సంక్రాంతి సీజన్ కి సినిమాలు ఏకధాటిగా రిలీజ్ అయ్యేవి. ఆ టైంలో కొన్ని సినిమాలు రిలీజ్ అనౌన్స్ చేసిన తర్వాత అందరూ కూర్చొని కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకునేటట్లు ప్లాన్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రతి శుక్రవారం బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని సినిమాల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే మంచిగున్న సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతుంటారు. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని ఆడియన్స్ మాత్రమే రిలీజ్ రోజు వేరే భాష సినిమాకి ప్రిఫరెన్స్ ఇస్తారు కానీ మిగతా ఇండస్ట్రీ వాళ్ళు మాత్రం ముందు వాళ్ళ సినిమా చూసి ఆ తర్వాత ఖాళీ ఉంటే మన సినిమాలు చూస్తుంటారు. ఇక మే ఒకటిన సూర్య నటిస్తున్న రెట్రో సినిమా రిలీజ్ కానుంది. దానితోపాటు నాని నటిస్తున్న హిట్ 3 సినిమా కూడా రిలీజ్ కానుంది.
సూర్యతో పోటీనా.?
నాని ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. నాని ఒక సినిమా ఎంచుకుంటున్నాడు అంటే కచ్చితంగా అది ప్రేక్షకులకు నచ్చుతుంది అని అందరూ ఒక స్థాయి నమ్మకానికి వచ్చేసారు. ఎందుకంటే నాని ఎంచుకున్న ప్రతి స్టోరీ దేనికదే ప్రత్యేకంగా ఉంటుంది. దసరా సినిమాతో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్ అందించాడు నాని. అలానే హాయ్ నాన్న సినిమాతో చాలామంది క్లాస్ పీపుల్ ఇష్టపడే క్లాసిక్ మూవీ అందించాడు. ఇప్పుడు యాక్షన్ ఫిలిం లవర్స్ కోసం హిట్ 3 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుండడంతో ప్రమోషన్స్ చాలా గట్టిగా ప్లాన్ చేశాడు. అయితే ఒక తమిళ్ ఇంటర్వ్యూలో సూర్య నటిస్తున్న రెట్రో సినిమా మే 1న రిలీజ్ కానుంది దానికి మీరు పోటీ అనుకుంటున్నారా.? అని అడగ్గా నాని తనదైన స్టైల్ లో సమాధానం ఇచ్చారు.
సినిమా ఒక సెలబ్రేషన్
నేను సూర్య సార్ తో పోటీ అని అనుకోవట్లేదు. నాకు కార్తీక్ సుబ్బరాజు వర్క్ అంటే చాలా ఇష్టం. సంతోష్ నారాయణ మ్యూజిక్ కూడా నాకు చాలా ఇష్టం. సూర్య సార్ సినిమాతో హిట్ కొట్టాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలుసు మీ అందరి ప్రాముఖ్యత ఫస్ట్ రెట్రో సినిమా అని. ఆ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. అలానే నా సినిమాతో కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. అలానే హిందీలో రైడ్2 సినిమా విడుదల కానుంది ఆ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలి. ఇక్కడ పోటీ అంటూ ఏం లేదు ఆరోజు అందరికీ సినిమా సెలబ్రేట్ చేసుకొని రోజుగా భావించాలి అంటూ నాని చెప్పుకొచ్చాడు.
Also Read : Singer Sunitha: సింగర్ సునీత మొదటి భర్త నుండీ ఎందుకు విడిపోయిందో తెలుసా..?