Vijay Sethupathi: ఈరోజుల్లో కొత్త కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతుంది అంటే దానిపై ముందు నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఒక హీరో, డైరెక్టర్ కలిసి మొదటిసారి సినిమా చేస్తున్నారంటే దాని గురించే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మొదలవుతుంది. అలా తాజాగా ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్న కాంబినేషన్ పూరీ జగన్నాధ్, విజయ్ సేతుపతి. గత కొన్నేళ్లుగా పూరీ జగన్నాధ్‌కు దర్శకుడిగా సరైన హిట్ లేదు. అలాంటిది విజయ్ సేతుపతి లాంటి ఫామ్‌లో ఉన్న హీరో ఆయనకు ఎలా అవకాశమిచ్చాడు అని అందరిలో సందేహం మొదలయ్యింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరొక రూమర్ వైరల్ అయ్యింది. ఇందులో హీరోయిన్ టబు కాదట.
టబు కాదట
విజయ్ సేతుపతి, పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో సినిమా అనగానే ముందుగా ప్రేక్షకులు షాకయ్యారు. విజయ్ సేతుపతి ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్న హీరో. కానీ పూరీ జగన్నాధ్ మాత్రం ఒక్క హిట్ చూసి చాలాకాలం అయ్యింది. అలాంటిది విజయ్ సేతుపతి పూరీకి ఎలా ఛాన్స్ ఇచ్చాడా అని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇక ఈ మూవీ గురించి అనౌన్స్‌మెంట్ బయటికి రాగానే ఇందులో హీరోయిన్ టబు అంటూ రూమర్స్ వచ్చాయి. విజయ్ సేతుపతి, టబు కాంబినేషన్ చూడడానికి చాలా డిఫరెంట్‌గా ఉంటుందంటూ అది కూడా మూవీకి ప్లస్ పాయింట్‌గా మారింది. టబునే ఇందులో లీడ్ రోల్ అని ఫిక్స్ అయినా.. విజయ్ సేతుపతి సరసన హీరోయిన్ తను కాదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఓటీటీ సెన్సేషన్
పూరీ జగన్నాధ్ (Puri Jagannadh), విజయ్ సేతుపతి (Vijay Sethupathi) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీలో టబు (Tabu) కేవలం ఒక కీలక పాత్రలో మాత్రమే కనిపించనుందట. కానీ విజయ్ సేతుపతితో రొమాన్స్ చేయడానికి ‘లెజెండ్’ హీరోయిన్ రాధికా ఆప్తే పేరును పరిగణనలోకి తీసుకుంటున్నారట మేకర్స్. రాధికా ఆప్తే ప్రస్తుతం ఓటీటీ సెన్సేషన్ అయిపోయింది. ఓటీటీలో ఏ సినిమా వచ్చినా, ఏ వెబ్ సిరీస్ రిలీజ్ అయినా అందులో రాధికా ఆప్తే ఉంటుందని ప్రేక్షకులు సైతం ఫిక్స్ అయిపోయారు. అలాంటి తను విజయ్ సేతుపతి సరసన ఒక తెలుగు సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందా అని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయినా వీరి పెయిర్ చాలా కొత్తగా, రిఫ్రెషింగ్‌గా ఉంటుందని ఫీలవుతున్నారు.
Also Read: ఆ సినిమా వల్ల వారం రోజులు డిప్రెషన్‌లోకి వెళ్లిన నాగ్ అశ్విన్.. ఇంతకీ ఏంటా సినిమా.?
తెలుగు తెరకు దూరం
2025 జూన్‌లో పూరీ, సేతుపతి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇంకా ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలను మేకర్స్ బయటపెట్టలేదు. అయితే రాధికా ఆప్తే (Radhika Apte) విషయానికొస్తే.. తను ‘లయన్’, ‘లెజెండ్’ లాంటి తెలుగు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మళ్లీ ఇంకెప్పుడు తెలుగు తెరపై కనిపించలేదు. పైగా తనకు సౌత్ ఇండస్ట్రీ పెద్దగా నచ్చలేదు అన్నట్టుగా పలుమార్లు ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ కూడా చేసింది. అందుకే ఇన్నాళ్ల తర్వాత పూరీ జగన్నాధ్ కోసం ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందా లేదా అని అందరిలో ఆసక్తి మొదలయ్యింది. ప్రస్తుతం తను హీరోయిన్‌గా మాత్రమే కాకుండా డైరెక్టర్‌గా కూడా డెబ్యూ చేయడానికి సిద్ధమయ్యింది.