ఈ వారం లోనే మొదటి సాంగ్ ..
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న చిత్రం కింగ్ డమ్. భాగ్యశ్రీ బోన్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. సత్యదేవ, అవినాష్, రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా నుండి మొదటి పాటను ఈ నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ నెల చివరిలో ఈ సినిమా మొదటి సింగిల్ ని రిలీజ్ చేయనున్నారు.ఈ వారం చివరిలో మూవీ సాంగ్ రిలీజ్ అవుతుందని నిర్మాత ప్రకటించారు. ఏ డేట్ అన్నది అధికారిక ప్రకటన విడుదల కాలేదు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు. జెర్సీ సినిమాతో పరిచయమైన అనిరుద్, తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ చేశారు. కింగ్డమ్ సినిమా బ్యాక్ గ్రౌండ్ అనిరుద్ అద్భుతంగా అందించారని తెలుస్తోంది.
సినిమా అప్పుడే వచ్చేది ..
అర్జున్ రెడ్డి తో హీరోగా విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. డియర్ కామ్రేడ్, ఖుషి, సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. 2017 లో వచ్చిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో రిషి పాత్రలో నానితో కలిసి నటించి మెప్పించాడు. 2016 లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాలో సోలో హీరోగా నటించారు ఆ తర్వాత 2017 లో ‘ద్వారక’ అంతగా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. ఆతర్వాత సంవత్సరం ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో మన ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. తాజాగా 2024లో ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాతో మన ముందుకు వచ్చారు. కింగ్డమ్ సినిమా మొదట మార్చి 28న రిలీజ్ చేయాలని అనుకున్నారు. అనుకోని కారణాల తో మే 30కు వాయిదా పడింది. సినిమాను వరల్డ్ వైడ్ గా మే 30వ తారీకు రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎటువంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Samantha:సడన్ గా తిరుమలలో ప్రత్యక్షమైన సమంత… ఎందుకోసం అంటే..?