BigTV English

Samantha: సడన్ గా తిరుమలలో ప్రత్యక్షమైన సమంత… ఎందుకోసం అంటే..?

Samantha: సడన్ గా తిరుమలలో ప్రత్యక్షమైన సమంత… ఎందుకోసం అంటే..?

Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణా రంగంలోకి అడుగు పెట్టారు. తన సొంత సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మొదటి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తన సొంత బ్యానర్ లో వస్తున్న సినిమా శుభం. ఈ సినిమా ఒక హారర్ కామెడీ జోనర్లో రూపొందించారు. ఈ సినిమాను మే 9న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ కి సమంత హాజరుకానున్నారు. తాజాగా సమంత తిరుమలలో సందడి కనిపించారు. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం..


అందుకోసమే వెళ్ళారా ..

సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సమంత బ్యానర్ లో రానున్న మొదటి చిత్రం శుభం. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేముందు సమంత తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. చాలా రోజుల తర్వాత తిరుపతిలో సమంత ఇలా కనిపించడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శుభం సినిమా సక్సెస్ అవ్వాలని ఆమె ఇలా కొండకి వచ్చారని అనుకుంటున్నారు. అక్కడ అభిమానులు ఆమెను చూడగానే చుట్టుముట్టారు. దర్శనం చేసుకొని వచ్చిన అనంతరం, అక్కడ అభిమానులతో కాసేపు ముచ్చటించి సమంత తిరుగు ప్రయాణమయ్యారు. శుభం సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేముందు సమంత ఇలా తిరుమల కొండకి రావడం శుభప్రదమని, అభిమానులు ఆమె మొదటిసారి ప్రొడ్యూసర్ గా నిర్మిస్తున్న ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.


నిర్మాతగా తొలి ప్రయత్నం ..

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి టాప్ పొజిషన్లోకి వెళ్లిన సమంత, ఆ తరువాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో ఆమె నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. అత్తారింటికి దారేది, బేబీ, జాను, యశోద, 2023లో వచ్చిన ఖుషి సినిమా వరకు అన్ని సూపర్ హిట్ గాని నిలిచాయి. తెలుగులో సమంతకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. తెలుగులో రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు ఏ సినిమా లో నటించలేదు. కొంతకాలం ఆమె ఆరోగ్యం బాగోలేక బయటకు రాలేదు. తరువాత కొన్ని వెబ్ సిరీస్ లో నటించారు. ఇప్పుడు నిర్మాతగా మారి, ప్రొడ్యూసర్ గా సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు సమంత. అందులో భాగంగా శుభం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి, శాలిని కీలకపాత్రలలో నటించినున్నారు. ఈ సినిమాకి సంగీతాన్ని క్లింటన్ అందించారు. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. సమంత మొదటి ప్రయత్నం సక్సెస్ అవ్వాలని, అభిమానులతో పాటు మనము కోరుకుందాం..

Jewel Thief OTT : కోట్లు పెట్టి తీశారు… చేసేదేమ్ లేకుండా.. డైరెక్ట్ ఓటీటీలో…

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×