BigTV English
Advertisement

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో ఉండేవి కేవలం మూడు పాటలు, ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడు అంటే.?

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాలో ఉండేవి కేవలం మూడు పాటలు, ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడు అంటే.?

Kingdom: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, నువ్విలా వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన విజయ్ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిపోయాడు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. పెళ్లిచూపులు సినిమా తర్వాత తెలంగాణ యాసకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది అని చెప్పాలి. అప్పటివరకు కొంతమంది విలన్ కు మాత్రమే వాడే ఈ లాంగ్వేజ్ ను శ్రీను వైట్ల దూకుడు సినిమాలో మహేష్ బాబు పెట్టి సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత పెళ్లిచూపులు సినిమాలో ప్రతి పాత్ర తెలంగాణ యాసలోనే మాట్లాడుతుంది. పెళ్లిచూపులు సినిమా తర్వాత విజయ్ దేవరకొండ గ్రాఫ్ మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి విజయ్ ను స్టార్ హీరోని చేసేసింది. అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ కెరియర్ లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అంటే, ప్రస్తుతం వరుసగా ఫెయిల్యూర్ సినిమాలు వస్తున్నా కూడా విజయ్ మార్కెట్ తగ్గట్లేదు.


కింగ్డమ్ ఆల్బమ్

ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్డమ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు గౌతం తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి విపరీతమైన అంచనాలను పెంచింది. అంతేకాకుండా ఈ సినిమా గురించి నాగ వంశీ ప్రతి ఇంటర్వ్యూ లోను ఎలివేషన్ ఇస్తూనే ఉన్నాడు. ఇక ఇప్పటివరకు గౌతం తీసిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా మీద క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఈ సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు ఉన్నాయట. వీటిలో ఒక పాటను నెక్స్ట్ వీక్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీని గురించి త్వరలో అధికారక ప్రకటన రావాల్సి ఉంది.


కేవలం మూడు పాటలేనా.?

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న దర్శకులలో గౌతమ్ కొంచెం ప్రత్యేకమని చెప్పాలి. గౌతమ్ మొదటి సినిమా మళ్లీ రావా వచ్చినప్పుడు తను ఇచ్చే స్పీచ్ అందరికీ గుర్తుండే ఉంటుంది. పాటలు విషయంలో గౌతమ్ చాలా పర్టికులర్ గా ఉంటాడు. ఒక పాట సినిమా కథను ముందుకు తీసుకెళ్లాలి, లేదంటే ఆ పాట సీన్ కు హై తీసుకొని రావాలి అని బలంగా నమ్మే దర్శకుడు. తను తీసిన మళ్లీ రావా సినిమాలో పాటలు కూడా అలానే ఉంటాయి. అలానే జెర్సీ సినిమాలో పాటలు కూడా అలానే ఉంటాయి. ఒక ప్రస్తుతం కింగ్డమ్ సినిమాలో గౌతమ్ ఏం ప్లాన్ చేశాడు మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ఈ సినిమాతో విజయ్ మంచి కం బ్యాక్ ఇస్తాడు అని అందరూ బలంగా నమ్ముతున్నారు.

Also read : Nani : లేడీ ఫ్యాన్ బర్త్ డే రోజు నాని సడన్ సర్ప్రైజ్… అందుకే అయ్యా నీకు ఈ రేంజ్

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×