Vijay Sethupathi: మక్కల్ సెల్వన్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది విజయ్ సేతుపతి(Vijay Sethupathi) పేరు మాత్రమే. ఈయన సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి విజయ్ సేతుపతి హీరో అయినా.. విలన్ అయినా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసినట్టే నటిస్తారు. అయితే అలాంటి విజయ్ సేతుపతి తాజాగా తన మంచి మనసు చాటుకున్నారు. కార్మికులకు ఏకంగా భారీ విరాళం ఇస్తూ వార్తల్లో నిలిచారు. మరి ఇంతకీ విజయ్ సేతుపతి చేసిన ఆ గొప్ప పని ఏంటో ఇప్పుడు చూద్దాం.. హీరోగా.. విలన్ గా.. విభిన్న పాత్రలు పోషిస్తూ వైవిద్యభరితమైన సినిమాలు చేస్తున్న విజయ్ సేతుపతి సౌత్ తో పాటు నార్త్ లో కూడా రాణిస్తున్నారు. గత ఏడాది విజయ్ సేతుపతి నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.
సినీ కార్మికుల కోసం భారీ విరాళం..
ముఖ్యంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది వచ్చిన సినిమాల్లో మహారాజా (Maharaaja) సినిమా భారీ హిట్ కొట్టింది. ఎలాంటి బజ్ లేకుండా వచ్చిన మహారాజా మూవీ బ్లాక్ బస్టర్ అయింది.ఇక గత ఏడాది చివర్లో వచ్చిన ‘విడుదలై-2’ కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే హిందీలో కత్రినా కైఫ్ (Katrina Kaif) తో నటించిన ‘మెర్రీ క్రిస్మస్’ మూవీ కూడా హిట్ అయింది. అలా చేతినిండా అవకాశాలతో పాటు.. చేసిన సినిమాలన్నీ హిట్స్ అవ్వడంతో విజయ్ సేతుపతి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది. అయితే అలాంటి విజయ్ సేతుపతి తాజాగా తన మంచి మనసు చాటుకున్నారు. తాజాగా విజయ్ సేతుపతి దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ఉన్న కార్మికులకు ఏకంగా రూ.1.30 కోట్ల రూపాయల భారీ విరాళం ఇచ్చారు. అయితే విజయ్ సేతుపతి ఇచ్చిన ఈ విరాళాన్ని చలన చిత్ర రంగంలో పనిచేస్తున్న కార్మికుల ఇళ్ల నిర్మాణానికి ఖర్చు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది.అయితే ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ నిపుణులు అయినటువంటి రమేష్ బాలా (Ramesh Bala) తన సోషల్ మీడియా ఖాతా ద్వారా బయట పెట్టారు. విజయ్ సేతుపతి ఇచ్చిన రూ. 1.30కోట్ల విరాళాన్ని దక్షిణ భారతదేశ చలన చిత్ర రంగంలో పనిచేసే కార్మికుల ఇళ్ల నిర్మాణం కోసం ఖర్చు చేయబోతున్నట్టు తెలియజేశారు. అంతేకాదు మంచి మనసుతో విజయ్ సేతుపతి ఇచ్చిన ఈ విరాళాన్ని వారి ఇళ్లకు ఖర్చు చేయడంతో పాటు ఆ అపార్ట్మెంట్ కి కూడా విజయ్ సేతుపతి పేరునే పెడతాం అని రమేష్ బాలా తెలియజేశారు.
విజయ్ సేతుపతి సినిమాలు..
ఇక రమేష్ బాలా చెప్పిన ఈ విషయం నెట్టింట్ వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ విజయ్ సేతుపతి చేసిన గొప్ప పనిని ప్రశంసిస్తున్నారు. ఇక మరికొంతమందేమో విజయ్ సేతుపతి లాగే మిగతా హీరోలు కూడా మీ వంతుగా ఎంతోకొంత సమాజానికి సేవ చేయాలని కామెంట్లు పెడుతున్నారు. ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం ఈయన చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ట్రెయిన్, ఏస్ వంటి సినిమాల్లో చేస్తున్నారు. అలాగే ఈయన నటించిన గాంధీ టాక్స్ (Gandhi talks) అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.